Ads
పలు చైనా యాప్ లను భారత ప్రభుత్వం బాన్ చేసిన సంగతి తెలిసిందే. వీటిల్లో పబ్జి గేమ్ కూడా ఉంది. అయితే.. పబ్ జి గేమ్ చైనా వాడిదే అయినా.. ఇండియా లో దానికి చాలా మంది ఫాన్స్ ఉన్నారు. అది దృష్టిలో పెట్టుకుని పబ్ జి కి ఆల్టర్నేట్ గా మరో గేమింగ్ ఆప్ ను రూపొందించారు. అదే “బాటిల్ గ్రౌండ్స్ మొబైల్ ఇండియా”. ఈ గేమ్ కోసం రిజిస్ట్రేషన్స్ ఓపెన్ అయ్యాయి.
Video Advertisement
ప్రస్తుతం ఈ ప్రాసెస్ లైవ్ లోనే ఉంది. ఈ అప్ గురించి గతం లోనే అప్ డేట్ ఇచ్చారు. కానీ.. ఇప్పటివరకు ఈ గేమ్ లాంచ్ అయ్యే డేట్ గురించి అనౌన్స్ చేయలేదు. అయితే.. ఈ ఆట ఆడాలనుకునేవారు ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం మీరు గూగుల్ ప్లే స్టోర్ లో కానీ.. లేదా ఇక్కడ ఇవ్వబడిన లింక్ ద్వారా కానీ రిజిస్టర్ అవ్వొచ్చు. ప్రి రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి బంపర్ ఆఫర్ కూడా ఉందట. ఈ ఆఫర్ కి కేవలం ఇండియన్ ప్లేయర్స్ మాత్రమే అర్హులు. ఈ గేమ్ లాంచ్ అయినా తరువాత ఈ రివార్డును తీసుకోవచ్చట.
End of Article