బాబోయ్.. దీనిని పొరపాటున గడ్డి అనుకుని టచ్ చేస్తే ప్రాణాలు పోతాయి… ఈ వీడియో చూస్తే మైండ్ బ్లాక్..!

బాబోయ్.. దీనిని పొరపాటున గడ్డి అనుకుని టచ్ చేస్తే ప్రాణాలు పోతాయి… ఈ వీడియో చూస్తే మైండ్ బ్లాక్..!

by Anudeep

Ads

సాధారణంగా ఎవరికైనా పాములను చూస్తేనే హడలు పుడుతుంది. ఇప్పటికే ఈ సృష్టిలో రకరకాల పాములున్నాయి. కానీ ఈ కొత్త రకం పాము నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. అందరికి భయం కలిగిస్తోంది. సృష్టిలో ఉన్న సరీసృపాలలో చాలా రకాల పాములు విషపూరితమైనవి, కొన్ని అరుదైన రకాలు అత్యంత విషపూరితమైనవిగా ఉన్నాయి.

Video Advertisement

కొన్ని రకాల పాములు మాత్రమే విషపూరితం కాక సాధారణంగా ఉన్నవి. అయితే.. ఈ వీడియోలో కనిపిస్తున్న పాము విషపూరితమైనదే. కానీ, ఇది అసలు పాములాగానే కనబడకపోవడం విచిత్రం.

puff snake 1

ఈ పాము ని నీటిలో కదులుతూ ఉండగా థాయిలాండ్‌లోని సఖోన్ నఖోన్‌లో 49 ఏళ్ల తూ అనే వ్యక్తి గుర్తించారట. ఇది చూడడానికి నాచు మొక్క వలె ఉంది. పాము చర్మానికి నాచు మొక్క మొలిచి అది కదులుతూ ఉంటె ఎలా ఉంటుందో ఈ పాము కూడా చూడ్డానికి అలానే ఉంది. రెండు అడుగుల పొడవు ఉన్న ఈ పాము థాయిలాండ్ చిత్తడి నేలలో కనిపించింది. దీనిని చూసిన కొందరు మిస్టీరియస్ ఫర్రీ గ్రీన్ స్నేక్ అని పిలుస్తున్నారు. మరికొందరేమో ‘పఫ్-ఫేస్డ్ వాటర్ స్నేక్’ అని పిలుస్తున్నారు. దీని పేరు ఏదైనా మొత్తానికి ఈ పాము తెగ ఫేమస్ అయిపొయింది.

ఇది చూడగానే పాము అని గుర్తించలేము. అందుకే ఇటువంటి పాములతో మరింత జాగ్రత్తగా ఉండాలి. NSW సెంట్రల్ కోస్ట్‌లోని వైల్డ్‌లైఫ్ ARC కి చెందిన ప్రతినిధి సామ్ చాట్‌ఫీల్డ్ ఈ పాము గురించి మాట్లాడుతూ.. ఇటువంటి పాములకు చర్మం పైన ఉండే పొలుసులు ఎక్కువగా కెరటిన్ తో తయారు అవుతాయని అన్నారు. పాము కదులుతూ ఉన్నపుడు ఈ పొలుసులు వెలుపలికి తెరుచుకుంటూ ఉంటాయని అన్నారు. దీనిని పఫ్-ఫేస్డ్ వాటర్ స్నేక్/ మాస్క్డ్ వాటర్ స్నేక్ అని పిలుస్తారన్నారు.

Watch Video:


End of Article

You may also like