ఓటిటి నుండి తీసేసిన పునీత్ రాజ్ కుమార్ సినిమా… ఎందుకో తెలుసా…?

ఓటిటి నుండి తీసేసిన పునీత్ రాజ్ కుమార్ సినిమా… ఎందుకో తెలుసా…?

by Mounika Singaluri

Ads

కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ మరణించి ఎన్ని రోజులు అవుతున్నా కూడా ఇప్పటికీ అభిమానులు గుండెల్లో బ్రతికే ఉన్నారు. కరోనా సమయంలో ఆ విపత్తు కన్నా అందరి గుండెల్ని బరువెక్కించిన వార్త ఏదైనా ఉందంటే అది పునీత్ రాజ్ కుమార్ మరణం.

Video Advertisement

దక్షిణాది ఇండస్ట్రీ మొత్తం తమ సొంత మనిషికి కోల్పోయిందని శోక సంద్రంలో మునిగిపోయింది. టాలీవుడ్ స్టార్ హీరోలు సైతం ఆయన భౌతిక కాయానికి నివాళులు అర్పించారు. ఇక ఆయన చేసిన సేవలు తెలిసి సామాన్యులు సైతం ఫ్యాన్స్ అయిపోయారు.

dr devi shetty message about puneeth rajkumar demise goes viral

కానీ చిన్న వయస్సులోనే గుండె పోటుతో మరణించాడు. ఆయన మరణించిన కానీ తన సినిమాలతో ఇంకా అలరిస్తూనే ఉన్నాడు ఈ హీరో… ఆయన చనిపోయిన తర్వాత కూడా ఆయన సినిమాలు రిలీజ్ అయి మంచి విజయాన్ని నమోదు చేసుకున్నాయి…! జేమ్స్, లక్కీమ్యాన్, గంధడ గుడి రిలీజ్ అయ్యాయి. ఆయన చివరిగా నటించిన చిత్రం గంధడ గుడి. డాక్యుమెంటరీ మూవీగా తెరకెక్కిన ఈ చిత్రం 2022 అక్టోబర్‍లో థియేటర్లలో విడుదలై మంచి విజయాన్ని నమోదు చేసింది.

interesting facts about puneeth rajkumar

ఈ మూవీకి మంచి రేటింగ్స్ కూడా వచ్చాయి. 10కి 9.3 రేటింగ్ వచ్చింది.  ఈ సినిమా ఓటిటి హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకుంది. అయితే వెంటనే ఓటీటీలోకి వచ్చినప్పటికీ పలు కారణాలతో అమెజాన్ ఈ సినిమాను తొలగించింది. అయితే టైటిల్ లైసెన్స్ గడువు ముగిసిపోవడంతో ఈ సినిమాని తొలగించినట్లుగా అమెజాన్ ప్రకటించింది.అయితే అమెజాన్ లో తీసేసిన ఈ సినిమాని మనం ఎక్కడ చూడవచ్చు అంటే…. గూగుల్ టీవీ, ఐ ట్యూన్, యాపిల్ టీవీ, యూట్యూబ్స్ లో చూడొచ్చు.

reason behind puneeth rajkumar demise

ఈ సినిమాను చూడాలంటే రూ. 100 చెల్లించి వీక్షించవచ్చు. ఇక ఈ సినిమా నిడివి సుమారు గంటన్నర పైన ఉంటుంది. 98 నిమిషాల ఈ డాక్యుమెంటరీ సినిమాను కర్ణాటక రాష్ట్ర అడవులు, ప్రకృతి వనరులు, జీవ వైవిధ్యంలోని గొప్పతనాన్ని ఆవిష్కరిస్తూ తెరకెక్కించారు. ఈ సినిమాని పునీత్ రాజ్కుమార్ స్వయంగా నిర్మించి నటించారు.


End of Article

You may also like