Ads
కన్నడ స్టార్ నటుడు పునీత్ రాజ్‌కుమార్ గుండెపోటు కారణంగా మరణించారు. పునీత్ కి కేవలం కన్నడలో ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా, ఇతర భాషల ఇండస్ట్రీలలో కూడా చాలా ఫాలోయింగ్ ఉంది. శుక్రవారం ఉదయం జిమ్ లో వ్యాయామం చేస్తున్నప్పుడు పునీత్ ఒక్కసారిగా కిందపడిపోయారు. ఆస్పత్రికి వెళ్లే సరికి పునీత్ పరిస్థితి చాలా విషమంగా ఉంది అని డాక్టర్లు చెప్పారు. చికిత్స అందించిన కొంతసేపటి తర్వాత పునీత్ తుది శ్వాస విడిచారు.
Video Advertisement
పునీత్ కు ఓ చిరకాల కోరిక ఉందట. అది తీరకుండానే ఆయన కన్నుమూశారు. ఈ విషయం గురించి దర్శకుడు మెహెర్ రమేష్ ఇటీవల ఓ ఇంటర్వ్యూ లో మాట్లాడారు. పునీత్ వల్లే తన కెరీర్ మొదలైందంటూ ఆయన గుర్తు చేసుకున్నారు. ఆయన పునీత్ ని హీరో గా పెట్టి “వీర కన్నడిగా” అనే సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమాతోనే తన కెరీర్ మొదలైంది అని గుర్తుచేసుకున్నారు. తాజాగా.. చిరు తో “భోళాశంకర్” ను రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం లో చిరు పక్కన తనకి కూడా ఒక రోల్ ఇవ్వాలి అంటూ పునీత్ మెహెర్ ని కోరారట. చిరు తో కలిసి నటించాలి అని అనుకున్నట్లు చెప్పారట. కానీ, అంతలోనే ఘోరం జరిగిపోయింది.
End of Article