Ads
యావత్ ప్రపంచానికి పీడ కలగా మిగిలిపోయిన సంవత్సరం 2020 ..ఒక మహమ్మారి కారణంగా యావత్ ప్రపంచం అల్లాడిపోయింది అటువంటి చేదు జ్ఞాపకాలను మిగిలించిన 2020 మనకు మంచే చేసింది అంటూ చక్కటి విశ్లేషణ ఇచ్చారు డైరెక్టర్ పూరి జగన్నాధ్ అదెలాగంటే ?
అందరూ 2020ని తిట్టుకుంటున్నారు. కానీ, మన జీవితంలో గత ఏడాది ఎంతో ఉత్తమమైంది. మనకు చాలా నేర్పింది, ఆరోగ్యం ఎంత ముఖ్యమో అర్థమైంది. రోగనిరోధక శక్తి చాలా అవసరమని తెలిసింది. పోషకాహారం విలువ తెలిసింది. పరిశుభ్రత నేర్చుకున్నాం. పుట్టిన తర్వాత ఎప్పుడూ మనం ఇన్నిసార్లు చేతులు కడుక్కోలేదు పల్లెటూళ్లలో పుట్టిన వాళ్లకు కూడా చాలా విషయాలు తెలిశాయి. వైరస్, శానిటైజర్, క్వాలైంటన్, యాంటీబాడీస్ ప్లాస్మా, స్టెయిన్ ఇలా ఎన్నో విషయాలు తెలిసిపోయాయి.
Video Advertisement
మొదట్లో నెలరోజులు లాక్డౌన్ అంటే మనకు పిచ్చిపట్టినట్లయింది. ఖాళీగా ఇంట్లో కూర్చోవాలంటే మానసిక ఆరోగ్యం చాలా అవసరమని తెలుసుకున్నాం. మనలో ఓపిక పెరిగింది. ఎనిమిది నెలలు ఎలా గడిచిపోయాయో మనకే తెలియలేదు. డబ్బు ఉన్నా లేకపోయినా.. ఎలా బతికామో మనకే తెలియదు. నిజమైన స్నేహితులు ఎవరో ఇప్పుడే తెలిసింది. అని డైరెక్టర్ పూరి జగన్నాధ్ చెప్పుకొచ్చారు.
End of Article