అల్లు అర్జున్ “పుష్ప-2” సినిమాకి హైలైట్ అవ్వబోయే సీన్ ఇదేనా..?

అల్లు అర్జున్ “పుష్ప-2” సినిమాకి హైలైట్ అవ్వబోయే సీన్ ఇదేనా..?

by Mohana Priya

Ads

అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యింది అనే విషయం అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమా సెకండ్ పార్ట్ కోసం అందరూ ఎదురు చూస్తున్నారు.

Video Advertisement

ఈ సినిమా షూటింగ్ పనిలో సినిమా బృందం అంతా బిజీగా ఉన్నారు. ఇందులో చాలా మంది కొత్త నటీనటులు కూడా యాడ్ అవుతారు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి విడుదల అయిన వీడియో ప్రేక్షకుల ఆసక్తి ఇంకా పెంచింది.

ఈ సినిమా గురించి రోజుకి ఒక విషయం సోషల్ మీడియాలో ప్రచారంలో ఉంటుంది. ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి మరొక వార్త కూడా వైరల్ అవుతోంది. అదేంటంటే, ఈ సినిమాకి ఇంటర్వెల్ సీన్ హైలైట్ అవ్వబోతుందట. అప్పటి వరకు ఒకలాగా చూపించిన పుష్ప రాజ్ పాత్ర, ఇంటర్వెల్ తర్వాత మరొక రకంగా మారుతుంది. అంతే కాకుండా ఈ సినిమాలో రష్మిక పోషించిన శ్రీవల్లి పాత్ర మరణిస్తుంది అనే వార్తలు వస్తున్నాయి. దాంతో ఈ విషయంపై కూడా సెకండ్ హాఫ్ లో ఒక పెద్ద ట్విస్ట్ ఉంటుంది అని అంటున్నారు.

pushpa-2-update1

ఏదేమైనా సరే పుష్ప 2 సినిమా మాత్రం చాలా పెద్ద ఎత్తున షూట్ చేస్తున్నారు. ఈ సినిమాకి దేవి శ్రీ ప్రసాద్ సంగీత దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా పాటలు కూడా మరొక హైలైట్ అవ్వబోతున్నాయి. ఈ సినిమాతో అల్లు అర్జున్ కూడా గ్లోబల్ స్టార్ ఇమేజ్ సంపాదించుకుంటారు అని చాలా మంది అంటున్నారు. ఇప్పటికే అల్లు అర్జున్ కి దేశవ్యాప్తంగా చాలా క్రేజ్ ఉంది. ఈ సినిమాతో ఆ క్రేజ్ ఇంకా వేరే లెవెల్ కి వెళ్తుంది అని అంటున్నారు.


End of Article

You may also like