పుష్ప 2 లో అల్లు అర్జున్ ఈ కొత్త పదం వాడబోతున్నారా..!?

పుష్ప 2 లో అల్లు అర్జున్ ఈ కొత్త పదం వాడబోతున్నారా..!?

by Anudeep

Ads

పుష్ప ది రైస్ సెన్సేషనల్ హిట్ అవ్వడంతో పుష్ప ది రూల్ కోసం అంత ఎదురు చూస్తున్నారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో పుష్ప ది రైజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ముఖ్యంగా పుష్పలో బన్నీ తగ్గేదెలే మ్యానరిజంకు వరల్డ్ వైడ్ గా సూపర్ రెస్పాన్స్ వచ్చింది.

Video Advertisement

అల్లు అర్జున్ సిగ్నేచర్ స్టైల్ ను అనుకరిస్తూ సెబ్రెటీస్, క్రికెటర్లు కూడా ఇన్ స్టా రీల్స్ చేసిన విషయం తెలిసిందే. పుష్ప 1 బ్లాక్ బస్టర్ హిట్ కావడం తో, సెకండ్ పార్ట్ పుష్ప ది రూల్ కోసం మేకర్స్ గట్టి ప్లాన్ చేస్తున్నారు. ప్రతి ఒక్క విషయంలో అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు సమాచారం.

పుష్ప1 లో “తగ్గేదెలేలే” అంటూ చెప్పిన బన్నీ స్లాంగ్ కి విపరీతమైన క్రేజ్ రాగా, ఈ రెండవ పార్ట్ లో “కుమ్మేస్తా” అనే పదాన్ని వాడనున్నట్లు తెలుస్తోంది. సుకుమార్, బన్నీ, దేవి శ్రీ ప్రసాద్ కాంబో అంటేనే భారీ అంచనాలు ఉంటాయి.
ఇంతకు ముందు సుక్కు, బన్నీ, దేవి కలిసి ఆర్య, ఆర్య 2 చేశారు. వీరి కాంబో పుష్ప మరో సెన్సేషన్ క్రియేట్ చేయడం తో పుష్ప ది రూల్ కోసం ప్రేక్షకులు, అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఈ చిత్రంలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటించగా ఫాహద్ ఫజిల్, సునీల్, అనసూయ భరద్వాజ్, అజయ్, ధనంజయ తదితరులు ఈ చిత్రం లో కీలక పాత్రల్లో నటించారు. పుష్ప 2లో నవాజ్ ఉద్దీన్ సిద్ధికి కూడా ఉండే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది.


End of Article

You may also like