Pushpa-2: పుష్ప-2 బృందం ఈ విషయం మీదే ఎక్కువ ఫోకస్ పెడుతోందా..?

Pushpa-2: పుష్ప-2 బృందం ఈ విషయం మీదే ఎక్కువ ఫోకస్ పెడుతోందా..?

by Anudeep

Ads

పుష్ప 1 ది రైస్ బ్లాక్ బాస్టర్ హిట్ అవ్వడంతో పుష్ప 2 ది రూల్ కోసం అంత ఎదురు చూస్తున్నారు. అందుకు తగ్గట్టే సోషల్ మీడియాలో కూడా రకరకాల వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. సుకుమార్ ఇంకా పుష్ప 2 షూటింగ్ స్టార్ట్ చేయలేదు కానీ కథ గురించి రకరకాల ప్రచారాలు మొదలైపోయాయి. అందులో ప్రధానమైనది శ్రీవల్లి పాత్రకు సంబంధించిన ట్విస్టు.

Video Advertisement

రెండో భాగంలో ఆ పాత్రను చంపేస్తారని, దానికి ప్రతీకారంగా ప్రీ క్లైమాక్స్ నుంచి పుష్ప రాజ్ విశ్వరూపం ఉంటుందని ఇలా ఏదేదో స్టోరీలు అల్లేస్తున్నారు. అదే నిజమానుకొని కొంతమంది సోషల్ మీడియాలో వైరల్ చేయడం, రకరకాల మీమ్స్ రావడం జరిగిపోయింది. అయితే ఫ్రెష్ గా దానికి సంబంధించిన అనఫీషియల్ లీక్ ఒకటి వచ్చేసింది.

శ్రీవల్లి క్యారెక్టర్ కు ఎలాంటి సాడ్ ఎండింగ్ ఉండదు. చివరి దాకా బ్రతికే ఉంటుందట. ఒకవేళ అలా చేస్తే కెజిఎఫ్ 2తో పాటు మరికొన్ని సినిమాల నుంచి తీసుకున్నట్టు ఉండడమే కాక రొటీన్ గా ఫీలయ్యే ఛాన్స్ ఉందని సుకుమార్ అలాంటి ప్లాన్ ఏం చేయలేదని తెలుస్తుంది. సుక్కు సార్ ఎక్కువగా హీరో, విలన్ క్లాష్ ని హై వోల్టేజ్ యాక్షన్ సీన్స్ తో ఎలా నింపాలనే డిస్కస్ చేస్తున్నారట. జూలై నుంచి రెగ్యులర్ షూటింగ్ అన్నారు కానీ ఆ సూచనలేమీ కనిపించడం లేదు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ట్యూన్స్ ఆల్రెడీ సిద్ధంగా ఉన్నాయట.


End of Article

You may also like