Ads
ప్రస్తుతం పుష్ప సినిమా థియేటర్లలో విడుదల అయ్యింది. పుష్ప రాజ్ అనే ఒక వ్యక్తి ఒక రోజు వారి కూలీ నుండి ఒక సిండికేట్ స్థాయికి ఎలా ఎదిగాడు? అలా ఎదిగే క్రమంలో అతను ఎదుర్కొన్న సమస్యలు ఏంటి? అనే అంశం చుట్టూ సినిమా మొత్తం తిరుగుతుంది. దీనికి రెండవ భాగం కూడా ఉంది అనే విషయం తెలిసిందే. ఆ సినిమాకి పుష్ప – ద రూల్ అనే పేరు పెట్టారు.
Video Advertisement
అయితే, పుష్ప సినిమా టాక్ మాత్రం మిక్స్డ్ గానే వస్తోంది. కొంత మంది మాత్రం, “అసలు సినిమా ఇంకా చాలా బాగుంటుంది అని ఊహించామని” అంటున్నారు. సినిమా స్టోరీ మనం అంతకుముందు చాలా సినిమాల్లో చూసి ఉన్నాం. కానీ సుకుమార్ ప్రెజెంట్ చేసిన విధానం మాత్రం కొత్తగా అనిపించింది. ఇదిలా ఉండగా, ఈ సినిమా ఒక ప్రముఖ సిరీస్ నుండి ఇన్స్పైర్ అయ్యి తీశారు అనే వార్తలు వస్తున్నాయి. పుష్ప సినిమా నార్కోస్ అనే ఒక ప్రముఖ స్పానిష్ సిరీస్ కథని పోలి ఉంటుంది.
ఈ సిరీస్ లో కూడా హీరో అయిన ఎస్కోబార్ ముందు సాధారణ డ్రగ్ స్మగ్లర్ గా జీవితం మొదలు పెడతాడు. తర్వాత డాన్ గా మారుతాడు. పుష్ప సినిమాలో మాత్రం డ్రగ్స్ తీసేసి ఎర్రచందనం పెట్టారు. అలాగే నార్కోస్ కొంచెం ప్రస్తుతం ఉన్న రియాలిటీకి దగ్గరగా ఉంటుంది. పుష్ప సినిమాలో మాత్రం యాక్షన్ సీన్స్ పై దృష్టి పెట్టారు. అంతే కాకుండా, మధ్యలో కొన్ని సీన్స్ కూడా నార్కోస్ సిరీస్ లో ఉన్న కొన్ని సీన్స్ ని పోలి ఉంటాయి.
ఒకవేళ నిజంగా సినిమా ఈ సిరీస్ నుండి ఇన్స్పైర్ అయ్యి తీస్తే మాత్రం రెండవ భాగంలో హీరో పాత్ర ఇంకా పవర్ ఫుల్ గా మారుతుంది. అయితే, నార్కోస్ లో హీరో పాత్ర చనిపోతాడు. కానీ పుష్ప – ద రూల్ లో మాత్రం అలా ఉండే అవకాశం లేదు. అంతే కాకుండా, ఆ సిరీస్ లో హీరో ఎస్కోబార్ తన భార్యను ఎవరేమన్నా ఊరుకోడు. ఈ విషయాన్ని మనకి పుష్ప మొదటి భాగంలోని చూపించేశారు. కథని మన నేటివిటీకి తగ్గట్టు మార్పులు చేసినా కూడా ఎక్కడో నార్కోస్ ని పోలినట్టు ఉంది అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
End of Article