ఐకాన్ స్టార్ ‘పుష్ప’ సినిమా ఫస్ట్ టాక్ వచ్చేసింది.. సెన్సార్ టాక్ ఏమిటంటే..?

ఐకాన్ స్టార్ ‘పుష్ప’ సినిమా ఫస్ట్ టాక్ వచ్చేసింది.. సెన్సార్ టాక్ ఏమిటంటే..?

by Megha Varna

Ads

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప’ సినిమా డిసెంబర్ 17న విడుదల కానుంది. పైగా ప్రస్తుతం ఎక్కడ చూసినా నడుస్తున్న టాపిక్ పుష్ప. అల్లు అర్జున్ కూడా ఈ సినిమాలో డిఫరెంట్ గా కనిపిస్తున్నారు. అంతే కాకుండా ఈ సినిమా అల్లు అర్జున్ మొదటి పాన్ ఇండియా కావడంతో ఎక్స్పెక్టేషన్స్ భారీగా వున్నాయి.

Video Advertisement

రీసెంట్ గా సెన్సార్ పనులను పూర్తి చేసుకుని ఈ చిత్రం U/A సర్టిఫికెట్ ను సొంతం చేసుకుంది. మొత్తం 02:59 సినిమా ఇది. అయితే ఈ సినిమాకి సంబంధించి ఫస్ట్ టాక్ కూడా బయటకి వచ్చేసింది. ఈ సినిమాలో సునీల్ ఎర్రచందనం స్మగ్లింగ్ కింగ్. అయితే ఎర్రచందనంను అడవుల్లో నుంచి తీసుకెళ్లి సునీల్ కి అల్లు అర్జున్ గ్యాంగ్ మొత్తం కష్టపడి అప్పగించడం… దీనిని వేరే దేశాలకి తీసుకెళ్లి కోట్లు సంపాదించడం జరుగుతుంది.

కానీ అల్లు అర్జున్ గ్యాంగ్ కి ఏమి ఇవ్వరు. అయితే అల్లు అర్జున్ ఎలా రియాక్ట్ అవుతాడు..?, ఎలా హీరో నెమ్మదిగా ఎదుగుతాడు అనేది కథ. పైగా ఈ సినిమాలో ట్విస్టులు ఒక రేంజ్ లో ఉంటాయి అని అర్థమవుతుంది. స్టోరీ కాస్త సింపుల్ గా ఉన్నా ఎలివేషన్స్ మాత్రం ఎక్కువగా కనబడుతున్నాయి. ఈ సినిమాలో హీరోయిజం, సాంగ్స్ ప్లస్ అవుతాయి. ఇదే రేంజ్లో రిలీజ్ రోజు టాక్ వస్తే ఇక మాస జాతరని ఆపడం కష్టమే.


End of Article

You may also like