Ads
Pushpa Russian trailer: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప’ సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు. ఈ చిత్రంలోని తగ్గేదేలే డైలాగ్ ఎంత పాపులర్ అయిందో చెప్పనక్కర్లేదు. ఆ డైలాగ్ లానే పుష్ప సినిమా కూడా తగ్గడం లేదు. డిసెంబర్ 8న రష్యాలో పుష్ప మూవీ రిలీజ్ కాబోతుంది. ఈ క్రమంలో ఈరోజు రష్యన్ భాషలో ట్రైలర్‌ను విడుదల చేశారు.
Video Advertisement
తెలుగు సినిమా స్థాయి పెరిగింది. ఇప్పుడు విదేశాల్లో సైతం మన తెలుగు సినిమా హవా నడుస్తోంది. ఇప్పటికే దర్శక ధీరుడు రాజమౌళి డైరెక్షన్లో వచ్చిన ‘ఆర్‌ఆర్‌ఆర్’ పలు దేశాల ప్రేక్షకులను ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప’వంతు వచ్చింది. పాన్ ఇండియా స్థాయిలో హిట్ అయిన ఈ సినిమా ఇప్పుడు రష్యాలోని ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు రెడీ అవుతోంది.
‘పుష్ప’ సినిమాను సెప్టెంబర్‌లో మాస్కో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో రష్యన్ సబ్‌టైటిల్స్‌తో ప్రదర్శించారు. నిర్మాతలు ఈ వేదిక మీదే ఈ మూవీని రష్యన్ డబ్బింగ్ వర్షన్ ను రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. మైత్రి మూవీ మేకర్స్ తాజాగా విడుదల తేదీని ప్రకటించారు. డిసెంబర్ 8న ‘పుష్ప’ సినిమాని రష్యాలో విడుదల చేయనున్నట్లు ట్వీట్ చేసింది. పోస్టర్‌ను కూడా విడుదల చేసి, రష్యన్ భాషలో ట్రైలర్‌ను రిలీజ్ చేయనున్నట్లు పేర్కొంది. ఈ క్రమంలో మాస్కోలో డిసెంబర్ 1న,సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో 3న ప్రీమియర్స్ వేయనున్నారు.
అంతేకాకుండా పుష్ప మూవీ యూనిట్ కూడా అక్కడి ఆడియెన్స్ ని పలకరించనున్నారు. ప్రస్తుతం అయితే అల్లు అర్జున్, సుకుమార్ ‘పుష్ప 2’ మూవీ షూటింగ్‌తో చాలా బిజీగా ఉన్నారు. ఈ సినిమా తొలి పార్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో పుష్ప-2 పై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని మరిన్ని హంగులతో పుష్ప కంటే బాగా రెడీ చేయడానికి సుకుమార్ బృందం కస్టపడుతోంది. ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. ప్రత్యేకమైన సెట్లో ముఖ్యమైన సన్నివేశాల షూటింగ్ జరుగుతున్నట్లు సమాచారం.
End of Article