Ads
ప్రస్తుతం ఎక్కడ చూసినా నడుస్తున్న టాపిక్ పుష్ప. ఈ సినిమాలో అల్లు అర్జున్ చాలా డిఫరెంట్ గా కనిపిస్తున్నారు. అంతే కాకుండా ఈ సినిమా అల్లు అర్జున్ మొదటి పాన్ ఇండియన్ సినిమా. ఇప్పటికే విడుదలైన టీజర్, పోస్టర్స్ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచాయి.
Video Advertisement
దాదాపు 12 సంవత్సరాల తర్వాత మళ్లీ అల్లు అర్జున్, సుకుమార్ కలిసి చేస్తున్న సినిమా పుష్ప.దాంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా డిసెంబర్ 17 వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
ఈ సినిమాలో నాలుగవ పాట “ఏయ్ బిడ్డ.. ఇది నా అడ్డా..” సాంగ్ ఇప్పటికే ఉర్రుతలు ఊగిస్తోంది. అయితే.. జియో సావన్ అప్లికేషన్ మాత్రం ఈ పాటని తప్పుగా చూపించింది. “ఏ బిడ్డా.. ఇది నా *డ్డ అంటూ చూపించడంతో నెటిజన్స్ ఓ రేంజ్ లో ఫైర్ అవుతున్నారు. అయితే జియో సావన్ వెంటనే సరిదిద్దుకోవడానికి తెలుగు అనే ఆప్షన్ ని తీసేసినా.. ఈలోపు జరగాల్సిన నష్టం జరిగిపోయింది.
https://twitter.com/Cr7_AADHF__/status/1463054737549377536?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1463054737549377536%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fsumantv.com%2Fmovies%2Fjiosaavn-makes-mistake-in-pushpa-song%2F52723%2F
End of Article