Ads
చిత్రం: పుష్ప
నటీనటులు: అల్లు అర్జున్, రష్మిక మందన, ఫహాద్ ఫాజిల్, జగపతిబాబు, సునీల్ శెట్టి, ప్రకాష్ రాజ్, సునీల్, అనసూయ తదితరులు
నిర్మాతలు: నవీన్ యెర్నేని, వై. రవి శంకర్
దర్శకత్వం: సుకుమార్
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
విడుదల తేదీ: డిసెంబర్ 17, 2021
Video Advertisement
స్టోరీ :
ఎర్ర చందనం డిమాండ్ ని ఫోకస్ చేస్తూ జపాన్ బ్యాక్ డ్రాప్ తో సినిమా మొదలవుతుంది. సుకుమార్ స్టైల్ లో టైటిల్స్ పడ్డాక ఎర్ర చందనం స్మగ్లింగ్ చేసే కూలీగా అల్లు అర్జున్ (పుష్ప రాజ్) పరిచయం అవుతాడు. పోలీసు గోవిందప్పగా హరీష్ ఉత్తమన్ పరిచయం అవుతారు. కొండారెడ్డి బ్రదర్స్ తో పుష్ప రాజ్ చేతులు కలుపుతాడు. అక్కడినుండి స్టోరీ కొంచెం లవ్ యాంగిల్ సైడ్ వెళుతుంది. శ్రీవల్లిగా రష్మిక పరిచయం అవ్వడం. ఆమె వెంట పుష్ప రాజ్ పడడం. మంగళం శీనుగా సునీల్, దాక్షాయినిగా అనసూయ తెరపై పరిచయం అవుతారు.
స్మగ్లింగ్ సీన్ తర్వాత సమంత స్పెషల్ సాంగ్. తర్వాత పుష్ప రాజ్ అమ్మతో ఎమోషనల్ సీన్స్ తో ఇంటర్వెల్. సునీల్ కి వ్యతిరేకంగా పుష్ప రాజ్ వెళ్లడంతో సెకండ్ హాఫ్ మొదలవుతుంది. కొండారెడ్డి బ్రదర్స్ కి కూడా పుష్ప రాజ్ ఎదురెళ్తాడు. అప్పుడు పుష్ప రాజ్ లైఫ్ లో ఎలాంటి ట్విస్ట్ ఎదురైంది? ఎలాంటి సమస్యల్లో పడ్డాడు? భన్వర్ సింగ్ షెకావత్ గా ఫహద్ మాస్ ఎంట్రీ ఇవ్వడం…ఇవన్నీ తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
రివ్యూ :
డైరెక్టర్ సుకుమార్ ఈ సినిమాకు అద్భుతమైన కథను అందించాడు. ఇందులో అల్లు అర్జున్, రష్మిక మందన మాస్ లుక్ లు అద్భుతంగా ఉన్నాయి. మధ్య మధ్యలో ట్విస్టులతో బాగా హైలెట్ గా చూపించారు. కానీ పార్ట్ 1 లో ఏదో వెలతి కనిపిస్తుంది. ఫాన్స్ అంచనాలను అందుకోలేకపోయింది. క్లైమాక్స్ 30 నిముషాలు ఇంటరెస్టింగ్ గా ఉంటుంది. ఫహద్ – పుష్పా రాజ్ ల మధ్య సన్నివేశాలు హైలైట్ క్లైమాక్స్ లో . పార్ట్ 2 లో ఎలా తీస్తారో వేచి చూడాలి.
ప్లస్ పాయింట్స్ :
- అల్లు అర్జున్, రష్మిక మందనల నటన
- సమంత స్పెషల్ సాంగ్
- సాంగ్స్,
- సినిమా స్టోరీ, బ్యాక్ గ్రౌండ్, డైలాగ్స్,
- ట్విస్ట్, ఎమోషనల్ సీన్స్
- ఫారెస్ట్, డామ్ సీన్స్
- క్లైమాక్స్
మైనస్ పాయింట్స్:
- అక్కడక్కడా బోరింగ్ సన్నివేశాలు
- సెకండ్ హాఫ్ లో అల్లు అర్జున్ – రష్మిక ల లవ్ సీన్స్
రేటింగ్ : 3.5 / 5
ట్యాగ్ లైన్:
ఎర్ర చందనం స్మగ్లింగ్ చేసే కూలి నుండి సిండికేట్ బాస్ గా ఎదగడమే పార్ట్ 1 పుష్ప రాజ్ “పుష్పా – ది రైజ్”. ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది. సెకండ్ హాఫ్ కొంచెం సాగదీశారు. క్లైమాక్స్ కి వచ్చేసరికి మళ్ళీ ఇంటరెస్టింగ్ గా ఎండ్ అయ్యింది. పుష్ఫ సినిమా ఒకసారి చూడచ్చు.
Also Read: Pushpa Movie Twitter Review
End of Article