ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప’ సినిమా డిసెంబర్ 17న విడుదల కానుంది. పైగా ప్రస్తుతం ఎక్కడ చూసినా నడుస్తున్న టాపిక్ పుష్ప. అల్లు అర్జున్ కూడా ఈ సినిమాలో డిఫరెంట్ గా కనిపిస్తున్నారు. అంతే కాకుండా ఈ సినిమా అల్లు అర్జున్ మొదటి పాన్ ఇండియా కావడంతో ఎక్స్పెక్టేషన్స్ భారీగా వున్నాయి.

Video Advertisement

రీసెంట్ గా సెన్సార్ పనులను పూర్తి చేసుకుని ఈ చిత్రం U/A సర్టిఫికెట్ ను సొంతం చేసుకుంది. మొత్తం 02:30 సినిమా ఇది. అయితే ఈ సినిమాకి సంబంధించి ఫస్ట్ టాక్ కూడా బయటకి వచ్చేసింది. ఈ సినిమాలో సునీల్ ఎర్రచందనం స్మగ్లింగ్ కింగ్. అయితే ఎర్రచందనంను అడవుల్లో నుంచి తీసుకెళ్లి సునీల్ కి అల్లు అర్జున్ గ్యాంగ్ మొత్తం కష్టపడి అప్పగించడం… దీనిని వేరే దేశాలకి తీసుకెళ్లి కోట్లు సంపాదించడం జరుగుతుంది.

కానీ అల్లు అర్జున్ గ్యాంగ్ కి ఏమి ఇవ్వరు. అయితే అల్లు అర్జున్ ఎలా రియాక్ట్ అవుతాడు..?, ఎలా హీరో నెమ్మదిగా ఎదుగుతాడు అనేది కథ. పైగా ఈ సినిమాలో ట్విస్టులు ఒక రేంజ్ లో ఉంటాయి అని అర్థమవుతుంది. స్టోరీ కాస్త సింపుల్ గా ఉన్నా ఎలివేషన్స్ మాత్రం ఎక్కువగా కనబడుతున్నాయి. ఈ సినిమాలో హీరోయిజం, సాంగ్స్ ప్లస్ అవుతాయి. సినిమా బృందం కూడా ఇందులో పాత్రలు మాత్రమే కనిపిస్తారు అని, ఆ పాత్ర పోషించిన నటులు అస్సలు కనిపించరు అని, సుకుమార్ అంత జాగ్రత్తగా అన్ని విషయాలపై శ్రద్ధ వహించారు అని, ఈ సినిమాకి 4 సినిమాలకి పడే అంత కష్టపడ్డాము అని అన్నారు.

pushpa movie review by umair sandhu

యూఏఈ ఓవర్సీస్​ సెన్సార్ బోర్డ్ మెంబర్ అయిన ఉమైర్ సంధు పుష్ప మొదటి రివ్యూ ఇచ్చారు. “పుష్ప అల్లు అర్జున్ కి వ్యక్తిగతంగా, అలాగే ప్రొఫెషనల్ గా ఒక టర్నింగ్ పాయింట్ గా నిలిచే సినిమా అవుతుంది. అద్భుతం అనే ఒక్క పదం మాత్రమే ఇప్పుడు అల్లు అర్జున్ గురించి చెప్పడానికి సరైన పదం. అల్లు అర్జున్ ని ఇలా చూసి ఫాన్స్ ఆశ్చర్యపోతారు” అని రాసారు.

Also Read: Pushpa Movie Review and Rating