Ads
Pushpa 2: సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్, రష్మిక జంటగా వచ్చిన పాన్ ఇండియన్ సినిమా ‘పుష్ప’ ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికి తెలిసిందే. అల్లు అర్జున్ సినిమా తెలుగు, మలయాళంలోనే హిట్ అవుతుందనుకుంటే, మొత్తం దేశాన్నే షేక్ చేసింది ఈ సినిమా.
Video Advertisement
మేకర్స్ తాజాగా విదేశాల పై కూడా దృష్టి పెడుతున్నారు. ఇక రెండో పార్ట్ ‘పుష్ప2’ను ప్రపంచవ్యాప్తంగా భారీ లెవల్లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారట. ‘పుష్ప: ది రూల్’ ఇటీవలే మొదలైంది. సినిమా ప్రారంభం కాస్త ఆలస్యమైనా, రిలీజ్ విషయంలో మూవీ యూనిట్ పక్కాగా ప్రణాళికలు వేస్తున్నట్టుగా తెలుస్తోంది. వరల్డ్ వైడ్ గా ఒకేసారి పుష్ప2 ను ఆడియెన్స్ ముందుకు తేవాలనే ఇప్పటి నుండే ప్రణాళికలు వేస్తున్నారు. ఇరవైకి పైగా దేశాల్లో ఈ మూవీని ఒకేసారి విడుదల చేయాలనే లక్ష్యంతో పని చేస్తోంది మైత్రీ టీమ్ అండ్ సుకుమార్ టీమ్.ఇక దీని కోసం ఇంటర్నేషనల్ ప్రమాణాలతో మూవీను రూపొందించడంతో పాటు, వివిధ భాషల్లో కూడా విడుదల చేయాలని చూస్తున్నారు. దీనితో పాటుగా తొలి పార్టు సినిమా చివరి సమయంలో కంగారు పడిన ఎక్స్పీరియన్స్ ని దృష్టిలో ఉంచుకుని, మళ్ళీ అలాంటివి రాకుండా విడుదల తేదీ ప్రకటన చేస్తారట. ఈసారి పక్కా ప్లాన్స్ బరిలోకి దిగారని సమాచారం. డిసెంబరు 8న ‘పుష్ప: ది రైజ్’ రష్యాలో విడుదల కానుంది.దీనికోసం మూవీ యూనిట్ ప్రస్తుతం రష్యాలో ప్రమోషన్స్ లో చురుగ్గా పాల్గొంటోంది. ఇక అక్కడి నుండి వచ్చాక పుష్ప 2 షూటింగ్ ప్రారంభిస్తారని సమాచారం. ఒక్కసారి సినిమా షూటింగ్ మొదలయ్యాక ఆగకుండా పూర్తి చేస్తారట.ఈ సినిమాలో పాట నటులతో పాటుగా కొత్త నటులు కూడా కనిపిస్తారని టాక్. అంటే మొదటి పార్టులో లేని పాత్రలు కొత్తగా వస్తాయట. అంతేకాకుండా ఈ సినిమాలో కూడా స్పెషల్ సాంగ్ ఉంటుందని, ఆ సాంగ్ కోసం బాలీవుడ్ హీరోయిన్ ను తీసుకొస్తున్నారని టాక్ వినిపిస్తోంది. ఇంకా దీనిలో విలన్లను కూడా పెంచుతున్నారని తెలుస్తోంది.
End of Article