ఒక స్త్రీ ఒక పురుషుడిని జీవితాంతం ప్రేమించాలి అంటే ఉండాల్సిన లక్షణాలు ఏంటో తెలుసా..? ఈ నెటిజెన్ ఏం చెప్పారంటే..?

ఒక స్త్రీ ఒక పురుషుడిని జీవితాంతం ప్రేమించాలి అంటే ఉండాల్సిన లక్షణాలు ఏంటో తెలుసా..? ఈ నెటిజెన్ ఏం చెప్పారంటే..?

by kavitha

Ads

సాధారణంగా మన జీవితంలో స్త్రీ ఒక తల్లిగా, ఒక భార్యగా, ఒక సోదరిగా, స్నేహితురాలిగా, అత్తగా, ఒక కోడలిగా, కూతురిగా ఎన్నో విజయవంతమైన పాత్రలను పోషిస్తోంది. తన ఇష్టఇష్టాలను పక్కన పెట్టి ఎన్నో విషయాల్లో తన కుటుంబానికి ప్రాధాన్యతను ఇస్తుంది.

Video Advertisement

స్త్రీ తనవారి కోసం ఎన్నో త్యాగాలను చేస్తుంది. స్త్రీ లేకుండా జననం అనేది లేదు. మరి అలాంటి స్త్రీ నిన్ను ఎప్పటికీ ప్రేమించాలంటే ఏం చేయాలి అనే ప్రశ్న ఎదురయితే దానికి సమాధానం ఏం చెప్తారు? ఏ ప్రశ్నకైనా సమాధానం దొరికే కోరాలో ఇదే ప్రశ్నని అడుగగా ఒక యూజర్ తనదైన శైలిలో సమాధానం తెలిపారు. మరి ఆ సమాధానం ఏమిటో ఇప్పుడు చూద్దాం..
భార్గవి కూర్మదాసు అనే యూజర్ కోరాలో అడిగిన ‘ఒక స్త్రీ నిన్ను ఎప్పటికీ ప్రేమించాలి అంటే ఏం చేయాలి’ అనే ప్రశ్నకు భార్యను దృష్టిలో ఉంచుకుని జవాబు చెప్పారు. ఒక భర్త, తన భార్యతో ఎలా ప్రవరిస్తే తను ప్రేమిస్తుంది అనేది వివరించారు.

  • భార్యను ఒకరితో పోల్చకూడదు. తనని తానుగా ప్రేమించాలి.
  • భార్య ఫిలింగ్స్ ను గౌరవించాలి.
  • అందరి ముందు భార్యను కించపరిచే విధంగా అస్సలు మాట్లాడకూడదు. ఆమె గురించి గొప్పలు చెప్పాల్సిన పని లేదు. కానీ, ఆమె కూడా భర్త నుండి తగిన గౌరవాన్ని ఆశిస్తుంది.
  • భార్యను పిల్లల ముందు అసలు తిట్టకూడదు.
  • ఆమెకు తగినంత భరోసా ఇవ్వాలి.
  • భార్యకి ఏ విషయం అయిన తెలియనపుడు హేళన చేయకుండా అర్ధం అయ్యేలా చెప్పేందుకు ప్రయత్నించండి.
  • అయితే పైన చెప్పినవ్వని చేస్తేనే భార్య ప్రేమిస్తుందని కాదు. కానీ ఆమెకు మీ పైన ఇష్టం, గౌరవం, ప్రేమ అనేవి మరింతగా పెరుగుతాయి. దానివల్ల భార్యాభర్తల మధ్య ఉండే బంధం ఇంకా బలపడుతుంది. భర్తకు చేసే పనులను ఎంతో ఇష్టంగా చేసి పెడుతుంది.Also Read: మగవాళ్ళతో పోలిస్తే ఆడవాళ్లే ఎక్కువగా విడాకులు అడుగుతున్నారా..? దీనికి కారణాలు ఏంటో తెలుసా..?

 


End of Article

You may also like