సీఎం కేసీఆర్ కేంద్రానికి సూచించిన…Quantitative Easing, Helicopter Money అంటే ఏంటి?

సీఎం కేసీఆర్ కేంద్రానికి సూచించిన…Quantitative Easing, Helicopter Money అంటే ఏంటి?

by Anudeep

Ads

ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా ఎప్పుడు తగ్గుతుందో తెలీదు, మందుల ద్వారా ఉపశమనం లభిస్తుంది కాని పూర్తి స్థాయిలో నిరోధించే వాక్సిన్ ఇప్పట్లో వచ్చే సూచనలు కనిపించట్లేదు. దేశాలన్ని ఇలాగే లాక్ డౌన్లో ఉంటే ఆర్ధికంగా అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సొస్తుంది . ఇదే విషయంపై తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్ మాట్లాడుతూ పైసలు ఎప్పుడైనా సంపాదించుకోవచ్చు, ప్రాణాలొస్తయా, బతికుంటే బలుసాకు తిని బతకొచ్చు అని అన్నారు..అంతేకాదు దేశం, రాష్ట్రం ఆర్ధికంగా ఉన్న నష్టాల నుండి కోలుకోవడానికి సూచనలు చేశారు..అవేంటో చదవండి.

Video Advertisement

ప్రతి వందేళ్లకి ఒకసారి ఏదో ఒక సంక్షోభం ప్రపంచాన్ని వణికిస్తూనే ఉంది అని చెప్పుకున్నాం కదా..మరి అప్పుడు ఆర్ధికంగా నిలదొక్కుకోవడానికి ఏం చేశారు అని మీకనిపించిందా? అప్పుడేం చేశారో ఇప్పుడు అదే ఫాలో అవుదామని చెప్పారు కెసిఆర్..ఇంతకీ అప్పుడు అనగా 1918లో స్పానిష్ ప్లూ వచ్చినప్పుడు కూడా ఫైనాన్షియల్  క్రైసిస్ వచ్చింది. అప్పుడు వాడిన పద్దతి క్వాంటిటేటివ్ ఈజింగ్(QE)ని అవలంభించారు.. అప్పుడే కాదు సంక్షోభాలు వచ్చినప్పుడు, కేంద్రం , రాష్ట్రప్రభుత్వాల దగ్గర డబ్బులేనప్పుడు ఇదే పద్దతిని వాడతారు..ఇదొక్కటే మార్గం..

ఇంతకీ QE పద్దతి అంటే ఏంటి?

మన దేశానికి రిజర్వ్ బ్యాంక్ ఉన్నట్టే ప్రతి దేశానికి ఆయా దేశాల బ్యాంక్స్ ఉంటాయి..ఉదాహరణకు అమెరికన్ ఫెడరల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ జపాన్, పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా మరియు బ్యాంక్ ఆఫ్ లండన్ . వారంతా వారి వారి బ్యాంకుల ద్వారా దేశానికి ఉన్న జీడీపీని బట్టి కొంత శాతం డబ్బును మార్కెట్లోకి రిలీజ్ చేస్తారు. దాని ద్వారా ఈ విపత్కర పరిస్థితి నుంచి బయటపడొచ్చు.

అమెరికా, బ్రిటన్ గవర్నమెంట్ లాంటి అనేక దేశాలు ఇదే పద్ధతి అవలంభిస్తున్నాయి. మన దేశం కూడా క్వాంటిటేటివ్ ఈజింగ్‌నే అనుసరించాలి. అమెరికా ఇప్పటికే  10శాతం అంటే 2ట్రిలియన్ డాలర్లు ఇచ్చింది. యూకే జీడీపీలోని 15శాతం ఇవ్వడానికి ముందుకు వచ్చింది. మనం కూడా మిగిలిన ఆ ఒక్క టెక్నిక్ ను వాడుకోవాలి. మన జీడీపీ 1920కి 203లక్షల కోట్లుగా నిర్ధారించబడింది. అందులో 5శాతం మనకు నిర్ణయిస్తే 10లక్షల కోట్లు మనకు వచ్చే ఆస్కారం ఉంది.

హెలికాఫ్టర్ మనీ అంటే:

హెలికాఫ్టర్ మనీ అంటే చాలా పెద్ద మొత్తంలో నేరుగా డబ్బులను ప్రజల వద్దకు తీసుకెళ్లడం. ఆర్థిక కుంగుబాటు నుంచి కోలుకోవడానికి లేదా వడ్డీ రేట్లు పూర్తిగా పడిపోయినప్పుడు నేరుగా ప్రజల వద్దకు సొమ్మును తీసుకెళ్లడాన్నే హెలికాఫ్టర్ మనీ అంటారు.

ప్రస్తుతం ఈ రెండు పద్దతుల ద్వారానే దేశం అయినా, రాష్ట్రం అయినా ఆర్ధిక సంక్షోభం నుండి గట్టెక్కగలం అని కెసిఆర్ సూచించారు. ఇఫ్పటికే దేశంలో కేరళ, తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వాలు కరోనాపై పోరాటాన్ని పటిష్టంగా కొనసాగిస్తున్నాయి. తెలంగాణా ముఖ్యమంత్రి అయినప్పటికి రెండు రాష్ట్రాలకి తానే ముఖ్యమంత్రా అన్నట్టుగా కెసిఆర్ పాలన ఉంది.దాంతో రెండు రాష్ట్రాల ప్రజలు కెసిఆర్ మాటను వేదవాక్కుగా ఫాలో అవుతున్నరు. ప్రజలు కరోనాని ఎదుర్కోవాలంటే లాక్ డౌన్ పొడిగించాల్సిందే అని ఏప్రిల్ 30వరకు లాక్డౌన్ పొడిగించిన విషయం తెలిసిందే..


End of Article

You may also like