Ads
గత కొన్ని సంవత్సరాల నుండి భారతీయ సినిమా ఇండస్ట్రీలో టాప్ దర్శకుల జాబితాలో వినిపిస్తున్న పేరు ప్రశాంత్ నీల్. ఒక్క సినిమాతో భారతదేశం అంతటా చాలా మంచి పేరు సంపాదించుకున్నారు ప్రశాంత్ నీల్. ఇప్పుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించే నెక్స్ట్ సినిమాలపై ఆసక్తి నెలకొంది.
Video Advertisement
ఆ సినిమాలకు సంబంధించి వార్తలు కూడా బయటికి వచ్చాయి. ప్రశాంత్ నీల్ ప్రభాస్ తో హీరోగా సలార్ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ తో ఒక సినిమా ఉంటుంది అని ప్రకటించారు. ఆ సినిమా తర్వాత రామ్ చరణ్ తో కూడా ఒక సినిమా ఉండే అవకాశాలు ఉన్నాయి అని వార్తలు వస్తున్నాయి.
దాంతో ప్రశాంత్ నీల్ మీద ఎన్నో నెగటివ్ కామెంట్స్ కూడా వస్తున్నాయి. అందుకు కారణం మొదటి రెండు సినిమాలు కన్నడ హీరోలతో చేసి, పేరు వచ్చిన తర్వాత తెలుగు ఇండస్ట్రీలో ఉన్న పెద్ద స్టార్ హీరోలతో వరుసగా కొన్ని పెద్ద సినిమాలకు దర్శకత్వం వహిస్తున్నారు. దాంతో ప్రశాంత్ నీల్ మీద కన్నడ ఇండస్ట్రీ ప్రేక్షకుల నుండి నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయి. ఇదే విషయాన్ని కోరాలో అడిగినప్పుడు ఒక వ్యక్తి స్పందించి ఈ విధంగా చెప్పారు. కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కేజీఎఫ్ – 2 తర్వాత టాలీవుడ్ లోకి వెళ్ళడానికి కారణం ఏంటి అనే ప్రశ్నకి మూవీ బఫ్ 139 అనే ఒక కోరా యూజర్ ఈ విధంగా సమాధానం చెప్పారు.
#1 డబ్బు
తెలుగు ఇండస్ట్రీలో చాలా పెద్ద నిర్మాణ సంస్థలు ఉన్నాయి. కన్నడ ఇండస్ట్రీ కంటే తెలుగు ఇండస్ట్రీ చాలా పెద్దది.
#2 నటులకి స్టార్డమ్
కన్నడ ఇండస్ట్రీలో ఒక డైరెక్టర్ కథని తయారు చేసి, ప్రొడ్యూసర్ లేదా నటులని కలిసి కథ వినిపించే సినిమా తీస్తారు. అంటే ఇక్కడ డైరెక్టర్ ముఖ్య పాత్ర పోషిస్తారు. తను ఒక సినిమా చేయాలి అనుకుంటే తానే వెళ్లి ప్రొడ్యూసర్ కి, నటులకి కథ చెప్పాలి. కానీ తెలుగు ఇండస్ట్రీలో ఒక డైరెక్టర్ కి హిట్ రాగానే ప్రొడ్యూసర్, హీరోలు డైరెక్టర్ ని వెతుక్కుంటూ వెళ్లి సినిమాలు తీస్తారు.
#3 సినిమాకి ఎక్కువ సమయం తీసుకోకపోవడం
తెలుగు ఇండస్ట్రీలో హీరోలు కొరటాల శివ, త్రివిక్రమ్ వంటి దర్శకులతో కమర్షియల్ సినిమాలు చేసినా కూడా సుకుమార్, రాజమౌళి వంటి దర్శకులతో ప్రయోగాత్మక సినిమాలు చేస్తారు. అందుకు కారణం హీరో కమర్షియల్ సక్సెస్ సాధించడం మాత్రమే కాకుండా మంచి నటుడిగా కూడా పేరు తెచ్చుకోవాలి. అందుకోసమే అటు కమర్షియల్ చిత్రాల్లో ఇటు ప్రయోగాత్మక సినిమాల్లో కూడా నటిస్తూ ఉంటారు.
ప్రశాంత్ నీల్ విషయానికి వస్తే ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన సినిమాలు కేవలం కమర్షియల్ గా మాత్రమే ఉండవు. హీరోని చాలా కొత్తగా చూపిస్తారు. అంతేకాకుండా ప్రశాంత్ నీల్ ఒకేసారి ఒకటి కంటే ఎక్కువ సినిమాలని సైన్ చేస్తారు. ఒకే సినిమాపై ఎక్కువ సమయం తీసుకోరు. రాజమౌళి, సుకుమార్ వంటి దర్శకులు ఒక సినిమాపై చాలా సంవత్సరాలు పని చేస్తారు. అందుకే ప్రశాంత్ నీల్ తో పని చేయడానికి చాలా మంది నటులు కూడా ఆసక్తి చూపిస్తున్నారు.
#4 ప్రశాంత్ నీల్ కన్నడ ఇండస్ట్రీకి అవసరమా?
ప్రశాంత్ నీల్ కన్నడ ఇండస్ట్రీకి అవసరమా అనే ప్రశ్నకు కూడా సమాధానం చెప్పారు. ఈ ప్రశ్నకి సమాధానం చెప్పు ఈ విధంగా అన్నారు. “ప్రశాంత్ నీల్ కన్నడ ఇండస్ట్రీ కి అవసరమే. కన్నడ ఇండస్ట్రీ మార్కెట్ దేశవ్యాప్తంగా విస్తరించడానికి ప్రశాంత్ నీల్ ఒక బ్రాండ్ గా నిలిచారు. ఒక గ్యాంగ్‌స్టర్ డ్రామాని తెరపై చాలా బాగా, రియలిస్టిక్‌గా చూపించడం ప్రశాంత్ నీల్ స్పెషాలిటీ.” అని రాశారు.
sourced from : Quora (Moviebuff139)
End of Article