Ads
కోరా లో ఏ ప్రశ్న కి అయినా సరే సమాధానం దొరుకుతుంది. కోరా లో ఒక ప్రశ్న కి ప్రపంచం మొత్తంలో ఎక్కడి నుంచైనా జవాబు వస్తుంది. చాలా మంది వారి ప్రశ్నలను ఇందులో అడిగి సమాధానాలు తెలుసుకుంటారు. అయితే ఈ విధంగానే ‘ఒక అమ్మాయి తక్కువ జీతం కలిగిన వ్యక్తిని పెళ్లి చేసుకుంటుందా..?’ అన్న ప్రశ్నకు సంజయ్ మహాపాత్ర సమాధానం ఇచ్చారు. ఈ ప్రశ్నకు సమాధానంగా తన జీవితం లో జరిగిన వివిధ ఘట్టాలను ఆయన తెలిపారు.
Video Advertisement
” 2015 లో నేను ఒక బిసినెస్ పెట్టి నష్టపోయాను. తర్వాత ఉద్యోగ ప్రయత్నాల్లో పడ్డాను. అప్పుడు నా గర్ల్ ఫ్రెండ్ ఇన్ఫోసిస్ లో 22 వేల జీతానికి పని చేసేది. అప్పుడు ఆమె నాకు రోజుకి 200 రూపాయలు ఇచ్చేది. నేను టిఫిన్, భోజనం చేసేందుకు ఇబ్బంది పడకూడదు అని ఆమె భావించేది. ఆలా కొన్నాళ్ళకు నాకు నా గర్ల్ ఫ్రెండ్ పనిచేసే కంపెనీ లోనే ఉద్యోగం వచ్చింది. ఆలా ఇద్దరం చాలా సంతోషంగా కలిసి గడుపుతూ.. రోజు కలిసి ఆఫీస్ కి వెళ్లి వచ్చేవాళ్ళం.
తర్వాత మేమిద్దరం ఆఫీస్ కి కలిసి వెళ్లేందుకు ఒక బైక్ కొన్నాం. మా నాన్నగారు ఆ బైక్ కి డౌన్ పేమెంట్ కట్టగా.. మిగతా దానికి లోన్ పెట్టా. ఆ లోన్ కూడా సగం నా గర్ల్ ఫ్రెండ్ కట్టింది. ఇద్దరం ఆ వెహికల్ వాడుకుంటున్నాము కదా అని నా నోరు మూయించేసింది. తర్వాత 2019 లో మేము పెళ్లిచేసుకున్నాం. ఆ తర్వాత మేము కార్ కొనుక్కోవాలని నిర్ణయించుకున్నాం. అప్పుడు కూడా నా వైఫ్ సగం లోన్ కట్టింది. నేను నా చదువుకోసం లోన్ తీసుకున్న అని ఆమెకు తెలుసు. నేను కష్టపడకూడదని ఆమె ఎప్పుడు భావించేది. అలాగే మా ఇంటిని నడిపేందుకు కూడా సగం ఖర్చులు ఆమె ఇచ్చేది.
ఇలా నా జీవితం లో ప్రతి సందర్భం లోనూ.. నా ప్రతి కష్టం లోనూ ఆమె ఉంది. నాకు ఏమి లేనప్పుడు కూడా ఆమె నా వెంటే ఉంది.. నాకు అన్ని ఉన్నప్పుడు కూడా ఆమె నాతోపాటు ఉంది. నా కోసం.. నా ప్రేమ కోసం ఆమె చేసిన వాటిని నేను ఎప్పటికి మర్చిపోలేను. ఇలా ప్రతి మగవాడికి వెన్నుదన్నుగా ఉండే ప్రతి మహిళకి చాలా కృతఙ్ఞతలు” అని సంజయ్ మహాపాత్ర కోరాలో అడిగిన ప్రశ్నకు సమాధానంగా తెలిపారు.
End of Article