Ads
లాక్ డౌన్ పెట్టింది ఎవరికోసం? లాక్ డౌన్ పాటించకపోతే ఎవరికి నష్టం? లాక్ డౌన్ పాటించకుండా రోడ్లపైకి వస్తే పోలీసులు కొట్టేది ఎవరి గురించి? మీకోసం..మీ ప్రాణాల కోసం..మీ కుటుంబాల కోసం.. ఈ సోయి ఉన్నోడు ఎవరైనా సరే రోడ్ మీదకి రాడు.. అత్యవసర పని మీద వచ్చేవాళ్ల గురించి మేం అనట్లేదు..అయినా నువ్ తొంబైతొమ్మిది మంచి పనులు చేసి, ఒక్క చెడ్డ పని చేయ్ 99మంచి పనుల్ని ఎవరూ గుర్తించరు,1చెడుని మాత్రం అందరూ వేలెత్తి చూపిస్తారు..ప్రస్తుతం పోలీసుల పనికి కూడా ఇదే పూర్తిగా వర్తిస్తుంది.పోలీసులు కొడుతున్నారు అని ఇదే లొల్లి తప్ప వాళ్లు చేసే మంచి పనులు కనపడవు చాలా మందికి.
Video Advertisement
నెలలు మీద పడుతున్నాయి, మంత్లీ చెకప్ కి వెళ్లాలి , మొన్నటివరకు ఉదయం నుండి సాయంత్రం వరకు అత్యవసరం అయితే బయటకి రానిచ్చేవారు.కాని ఇప్పుడు మూడు కిలో మీటర్లు దాటితే శిక్ష, ఉదయం పది తర్వాత బయట కనపడకూడదని నిబంధన, ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలో పాలుపోక పోలీస్ స్టేషన్ కి కాల్ చేసింది ఆ మహిళ. బాచుపల్లి దగ్గర ఆ జంటని పికప్ చేసుకుని ,మదీనాగూడలోని హాస్పిటల్లో చెకప్ చేయించి, మళ్లీ వారిని క్షేమంగా ఇంటి దగ్గర డ్రాప్ చేశారు రాచకొండ కమిషనరేట్ పోలీసులు.. దేశవ్యాప్త లాక్ డౌన్ కొనసాగుతున్న నేపధ్యంలో మెడికల్ ఎమర్జెన్సి అవసరం అయితే చాలా కష్టం. ప్రజలు కష్టపడకుండా ఉండేందుకు రాచకొండ కమిషనరేట్ వినూత్న ప్రయత్నం చేసింది.
ఐలైట్ పేరిట ఒక వాహన సర్వీస్ ని ఏర్పాటు చేసి, రాచకొండ కమిషనరేట్ పరిధిలోకి వచ్చే ఏరియా మొత్తం నుండి ఎవరైనా ఆరోగ్యరిత్యా సమస్య ఉందని కాల్ చేయగానే వారిని వెంటనే హాస్పిటల్ కి తరలించేందుకు వెహికిల్స్ ని పంపి సాయపడుతోంది. ఆ విధంగా రోజుకు వందల సంఖ్యలో కాల్స్ వస్తున్నాయి.దాంతో ఈ సర్వీస్ ను మరింత మెరుగుపర్చాలని నిర్ణయించుకుంది . రాచకొండ పోలీసులు చేస్తున్న ఈ పనికి ప్రజల నుండి ప్రశంసలు వస్తున్నాయి. ఇతర కమిషనరేట్లు కూడా ఇదే విధంగా చేస్తే బాగుంటుందని ఆశాభాశం వ్యక్తం చేస్తున్నారు.
నిజానికి కరోనా వైరస్ సోకిన వారికి ట్రీట్మెంట్ చేస్తూ డాక్టర్లు ఎంత కష్టపడుతున్నారో, కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా కట్టడి చేయడంలో పోలీసులు అంతే కష్టపడుతున్నారు . కాని ఆ కష్టాన్ని గుర్తించిన వారు తక్కువ ఎవరో ఒకరిద్దరు చేసిన తప్పుకి మొత్తం డిపార్ట్మెంట్ నే దుయ్యబడతారు. గత కొన్ని రోజులుగా మీరే చూస్తున్నారు కదా బయటికి వచ్చి ఎందుకొచ్చారంటే ఎంత సిల్లి రీజన్స్ చెప్తున్నారో..ఇలాంటి వారిని కొట్టకపోతే ఏం చేయాలి. అయినా నచ్చచెప్పడానికి వాళ్లేమైనా చిన్నపిల్లలా..ఒకసారి ఆలోచించండి.
End of Article