లాస్ట్ మినిట్‌లో ఈ ట్విస్ట్ ఏంటి..? “రాధే శ్యామ్” రిలీజ్‌కి ముందు..?

లాస్ట్ మినిట్‌లో ఈ ట్విస్ట్ ఏంటి..? “రాధే శ్యామ్” రిలీజ్‌కి ముందు..?

by Megha Varna

Ads

ప్రభాస్ ఫ్యాన్స్ అంతా కూడా రాధే శ్యామ్ సినిమా కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. గత కొన్ని నెలల నుండి కూడా రాధే శ్యామ్ సినిమా ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నా కూడా ఫలితం లేకపోయింది. సంక్రాంతికి ఈ పిక్చర్ విడుదల కావాలి కానీ డేట్ పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది.

Video Advertisement

అయితే ఈ సినిమాని మార్చి 11న విడుదల చేయాలి అని చిత్ర యూనిట్ అనుకుంది. తాజాగా చిత్ర యూనిట్ ఫాన్స్ కి మాత్రం ఒక బ్యాడ్ న్యూస్ ని చెప్పింది. మరొక సారి సినిమా మొత్తం ఎడిట్ చేయాలని చిత్ర యూనిట్ అనుకుంటోంది.

దీనికి గల కారణం ఏమిటంటే సినిమా అక్కడక్కడా డ్రై గా ఉండడం.. అలాగే ల్యాగ్ ఉండడం అని తెలుస్తోంది. అందుకనే ఆ పార్ట్స్ ని కాస్త ట్రిమ్ చేయాలని చిత్ర యూనిట్ అనుకుంటోంది. అలానే సినిమా టైం విషయంలో కూడా కొన్ని విమర్శలు వినపడ్డాయి. పైగా సినిమా ట్రైలర్ టైం మరియు ఫుటేజ్ గురించి కూడా కాస్త నెగిటివ్ గానే టాక్ నడిచింది.

సంక్రాంతికి ఈ సినిమా మొదట రిలీజ్ చేయాలని అనుకున్నారు కానీ ఇప్పుడైతే పోస్ట్ పోన్ చేశారు. అప్పుడు సంక్రాంతికి విడుదల చేయాలని అనుకోవడంతో సమయం లేకపోవడం వల్ల అలా పూర్తి చేసారు. అయితే ఇప్పుడు సమయం ఉంది కాబట్టి మరొక సారి ఎడిట్ చేయాలని… సినిమా లో మార్పులు చేయాలని అనుకుంటున్నారు.

కొంచెం క్రిస్ప్ చేస్తే బాగుంటుందని మార్పు చేస్తున్నారు. ఇది కూడా ఆఖరి దశకు వచ్చేసింది అని చెబుతున్నారు. ఈ సినిమా స్పెషల్ షో కూడా వేసి కొంత మంది సన్నిహితులకు చూపించడం జరిగింది. అయితే ఈ ఫీడ్ బ్యాక్ ఆధారంగా మళ్లీ ఎడిట్ రూమ్ కి ఈ సినిమాని తీసుకువెళ్లారు. అయితే మరి మార్చి 11న తెలుస్తుంది సినిమా ఎలా ఉంది అనే సంగతి. అప్పటి దాకా అభిమానులు ఎదురు చూడక తప్పదు.


End of Article

You may also like