“రాధేశ్యామ్” లో రైల్వే స్టేషన్ సెట్టా..? నిజం అనుకున్నామే.. అయినా దానికోసం ఇంత ఖర్చు పెట్టారా..?

“రాధేశ్యామ్” లో రైల్వే స్టేషన్ సెట్టా..? నిజం అనుకున్నామే.. అయినా దానికోసం ఇంత ఖర్చు పెట్టారా..?

by Anudeep

Ads

ఈ మధ్య సినిమా అనగానే.. ముందు వచ్చే ప్రశ్న ఎంత బడ్జెట్ లో అని. దానిని బట్టి సినిమా రేంజ్ ని డిసైడ్ చేసేస్తున్నారు. ఇక భారీ బడ్జెట్ సినిమాలైతే చెప్పక్కర్లేదు. ఒక్కో సీన్ ని డైమండ్ లా మలుస్తారు. అందుకోసం ఎంతైనా ఖర్చు చేస్తారు. భారీ సెట్ లు వేయిస్తారు. ఓ సినిమా కోసం భారీ గా సెట్ లు వేసుకునే ట్రెండ్ రాజమౌళి వచ్చాక మరింత ఎక్కువైందని చెప్పొచ్చు. తాజాగా విడుదల కాబోయే ప్రభాస్” రాధేశ్యామ్” గురించి కూడా ఇలాంటి చర్చ ఒకటి జరుగుతోంది.

Video Advertisement

radheshyam feature

ఇటీవల “రాధేశ్యాం” నుంచి గ్లిమ్ప్స్ పేరిట ఓ డైలాగ్ వీడియో విడుదల అయిన సంగతి తెలిసిందే. ఈ వీడియో లో రైల్వే స్టేషన్ లో వందలాది మంది ఆర్టిస్ట్ లు ఉన్న ఓ సీన్ ఉంది కదా. ఇది ఇటలీ లో ఎక్కడో రైల్వే స్టేషన్ లో తీసి ఉంటారని అంతా అనుకున్నారు. కానీ, కాదట. అదంతా సెట్ లో భాగమేనట. రైల్వే స్టేషన్ కోసం ప్రత్యేకం గా సెట్ వేసారట. ఇప్పటి దాకా ఇదంతా నిజం అనుకున్న అభిమానులు ఈ విషయం తెలియగానే షాక్ అవుతున్నారు.

radheshyam glimpse

ఆ మొత్తాన్ని విజువల్ ఎఫెక్ట్స్ తోనే ఆ వీడియో ను తీసారట. ఈ భారీ సెట్ లు, వీడియో ఎఫెక్ట్ లు చూస్తుంటే.. వీటికోసం ఇంకెంత ఖర్చు చేశారో అన్న అనుమానం రాక మానదు. మరో వైపు పాన్ ఇండియా రేంజ్ లో ఖర్చు చేసి.. తీరా సినిమా ఆ స్థాయి లో విజయం అందుకుంటుందా ..? లేదా..? అన్న చర్చలు కూడా అభిమానుల్లో జరుగుతోంది. ఇంతకష్టపడి తీశారంటే ఈ సినిమా కచ్చితం గా హిట్ అవ్వాలని కోరుకుందాం.


End of Article

You may also like