Ads
సినిమాల్లో నటించే నటులు చేసేవి నిజం కాదు. అంతా నటన. మనకు స్క్రీన్ మీద చూసినప్పుడు మనకు కనిపించే విధంగా ఆ సీన్ చిత్రీకరించేటప్పుడు ఆ పరిస్థితి ఉండదు. కేవలం సీన్ ని సీన్ లాగా మాత్రమే చిత్రీకరిస్తారు. కానీ చాలా మంది వాటిని నిజం అనుకొని సెలబ్రిటీల నిజ జీవితంలో ట్రోల్ చేయడం వంటివి చేస్తూ ఉంటారు. భారతదేశంలో ఉన్న బెస్ట్ హీరోయిన్లలో ఒకరు రాధిక ఆప్టే.
Video Advertisement
రాధిక ఆప్టే కమర్షియల్ సినిమాల్లో చాలా తక్కువగా నటిస్తారు. రాధిక ఆప్టే నటించిన వాటిలో ఎక్కువగా కథకి ప్రాధాన్యత ఇచ్చే సినిమాలు తన పాత్రకు ప్రాధాన్యత ఉన్న సినిమాలు మాత్రమే ఉంటాయి. రాధిక ఆప్టే తన ఇన్ని సంవత్సరాల సినిమా కెరియర్ లో నటించిన కమర్షియల్ సినిమాలను వేళ్ళ మీద లెక్కపెట్టవచ్చు.
అలా తన నటనతో ఎన్నో అంతర్జాతీయ స్థాయి అవార్డులను అందుకున్నారు రాధిక ఆప్టే. అయితే రాధిక ఆప్టేకి సంబంధించిన ఒక న్యూడ్ వీడియో అంతకు ముందు వైరల్ అయ్యింది. ఆ వీడియో గురించి, 2015 లో వచ్చిన పార్చ్డ్ అనే సినిమాలో తన పాత్ర గురించి రాధిక ఆప్టే మాట్లాడుతూ ఈ విధంగా అన్నారు.
“నేను క్లీన్ షేవెన్ అనే సినిమా షూట్ చేస్తున్నప్పుడు, నా వీడియో ఒకటి లీక్ అయినప్పుడు నన్ను చాలా ట్రోల్ చేశారు. అది నా మీద చాలా ప్రభావం చూపింది. నేను నా ఇంటి నుండి నాలుగు రోజులు బయటికి రాలేకపోయాను. మీడియా వల్ల కాదు. నా డ్రైవర్, వాచ్ మెన్, అలాగే నా స్టైలిస్ట్ డ్రైవర్ ఆ వీడియోలో ఉన్నది నేను అని గుర్తించారు” అని చెప్పారు.
రాధిక ఆప్టే మాట్లాడుతూ “ఆ ఫోటోలని, వీడియోలని సరిగ్గా గమనిస్తే తెలివిగా ఆలోచించగల ఎవరికైనా అందులో ఉన్నది నేను కాదు అని అర్థమైపోతుంది. కానీ ఆ సమయంలో వాటిని ఇగ్నోర్ చేయడం తప్ప ఏమీ చేయలేము. దాని గురించి ఏం మాట్లాడాలని ప్రయత్నించినా సమయం వృధా చేసినట్టే అవుతుంది.” అని అన్నారు.
End of Article