Ads
ప్రముఖ నటి రాధికా శరత్‌కుమార్, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, అలాగే మాజీ మంత్రి అయిన బండారు సత్యనారాయణ మూర్తి పై తన ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ సోషల్ మీడియా ద్వారా ఒక పోస్ట్ షేర్ చేశారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి రోజా మీద బండారు సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి.
Video Advertisement
ఒక మహిళపై ఇలాంటి ఆరోపణలు చేయడం సిగ్గుచేటు అని రాధిక అన్నారు. అలాంటి రాజకీయ నాయకుడిని చూసి నేను సిగ్గుపడుతున్నాను అని అన్నారు. రోజాకి తన మద్దతుని తెలుపుతూ సోషల్ మీడియాలో ఒక వీడియో షేర్ చేశారు. ఇందులో రాధిక ఈ విధంగా మాట్లాడారు.
ఈ విషయం మీద రాధిక మాట్లాడుతూ ఈ విధంగా తెలిపారు. “మంత్రి, నటి, మంచి స్నేహితురాలు అయిన రోజా గారికి నా మద్దతుని తెలుపుతున్నాను. గత కొద్ది రోజులుగా జరిగిన కొన్ని పరిణామాలు నన్ను చాలా బాధించాయి. అంతే కాకుండా నాకు కోపం కూడా తెప్పించాయి. మహిళలకు 33 శాతం రిజర్వేషన్ పార్లమెంట్ ఆమోదించింది. ఈ రోజు ఇండియా ఒక మంచి ప్రగతిశీల దేశంగా ఎదుగుతోంది. దీనికో సం దేశం అభివృద్ధి చేయడానికి ఎంతో మంది మహిళలు కూడా రాజకీయాల్లోకి వస్తున్నారు”.
“ఇలాంటి సమయంలో ఒక మహిళను అవమాన పరుస్తూ ఒక పార్టీకి చెందిన గౌరవనీయ సభ్యుడు నుంచి కామెంట్స్ వినాల్సి వచ్చింది. ఇవి ఎంతో సిగ్గుచేటు. మనం ఇండియాని భారతమాత అని అంటాం. అంటే ఒక మహిళతో మనం ఇండియాని పోలుస్తున్నాం. అలాంటప్పుడు ఒక మహిళకి మీరు ఇచ్చే గౌరవం ఇదేనా? మిమ్మల్ని చూసి సిగ్గు పడుతున్నాను. ఇది రాజకీయం కాదు. మీరు మాట్లాడిన భాష దిగజారడానికి నిదర్శనం. ఒక మహిళ గురించి ఇలాగేనా మాట్లాడేది. ఈ మాటలు ఏంటి? అసలు ఆ పదం ఎలా అన్నారు? మీ మాటలు విని ఆడవాళ్లు భయపడతారు అనుకుంటే అది చాలా తప్పు”.
“ఈ మాటలకు ఎవరు భయపడరు. మేం మీలాగా మాట్లాడడానికి సమయం పట్టదు. అలా మాట్లాడాలి అనుకుంటున్నారా? పొద్దున్నే మీరు కూడా లేచి పని మీద వెళ్తున్నారు కదా? మీ ఇంట్లో ఏం జరుగుతుందో మీకు తెలుసా? అందరూ మీ స్థాయికి వచ్చేలాగా చేయకండి. అలా మాట్లాడటం చాలా సులభం. ఇలా మీ మాటలతో ఒకరిని బాధించడం వల్ల మీకు వచ్చేది ఏంటి? సమాజంలో మీకు గౌరవం ఏమైనా పెరిగిందా? మిమ్మల్ని చూస్తే సిగ్గేస్తోంది. ఎంతో మంది గొప్ప వ్యక్తులు ఉన్న మీ పార్టీ గౌరవాన్ని మీరు తగ్గించారు” అంటూ రాధిక చెప్పారు.
watch video :
I condemn below the belt hitting , labelling women, objectifying and being unparliamentary, an ex minister #bandarasatyanarayana has no qualms with his language and attitude. I stand for minister /actor amd good friend @RojaSelvamaniRK #women #harassment #politics pic.twitter.com/nmGHyeLgi2
— Radikaa Sarathkumar (@realradikaa) October 6, 2023
ALSO READ : కలర్స్ స్వాతి, నవీన్ చంద్ర నటించిన “మంత్ ఆఫ్ మధు” చూశారా..? ఎలా ఉందంటే..?
End of Article