Ads
ఏ ఫీల్డ్ లో ఎదగాలన్నా కూడా కచ్చితంగా కష్టపడాలి. కానీ సినిమా రంగానికి చెందిన వాళ్లు వాళ్ళ జీవితం గురించి బయట ఇంటర్వ్యూలలో మాట్లాడుతూ ఉంటారు కాబట్టి వాళ్ళు అంత పెద్ద స్టేజ్ కి రావడానికి ఎంత కష్టపడ్డారో మనకి అర్థమవుతుంది. అలాగే ఎంతో కష్టపడి స్టార్ నటిగా ఎదిగారు మహిరా ఖాన్. మహిరా ఖాన్ పాకిస్తాన్ నటి.
Video Advertisement
కరాచీ లో పుట్టిన మహిరా ఖాన్ ఆ తర్వాత ఫౌండేషన్ పబ్లిక్ స్కూల్ లో చదువుకున్నారు. తనకి 17 సంవత్సరాలు ఉన్నప్పుడు హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం క్యాలిఫోర్నియా కి వెళ్లారు. అక్కడ శాంటా మోనికా కాలేజ్ లో చదువుకున్నారు. యూనివర్సిటీ ఆఫ్ సదరన్ కాలిఫోర్నియాలో డిగ్రీ కోసం తన పేరుని ఎన్రోల్ చేయించుకున్నారు మహిరా ఖాన్.
కానీ అండర్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేయకుండానే మహిరా ఖాన్ 2008 లో పాకిస్తాన్ కి తిరిగి వచ్చేశారు. యునైటెడ్ స్టేట్స్ లో చదువుకునేటప్పుడు మహిరా ఖాన్ లాస్ ఏంజిల్స్ లోని ఒక స్టోర్ లో క్యాషియర్ గా పనిచేశారు. అంతే కాకుండా ఆ స్టోర్ లో టాయిలెట్స్ క్లీన్ చేయడం, అలాగే ఫ్లోర్ తుడవడం కూడా చేశారు.
20o6 లో ఎమ్ టివి (M TV) పాకిస్తాన్ లో వీజే గా తన కెరీర్ ని మొదలు పెట్టారు. తర్వాత 2011 లో బోల్ అనే సినిమాతో హీరోయిన్ గా అడుగుపెట్టారు. ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో నటించారు మాహిరా ఖాన్. అంతే కాకుండా 2017 లో బాలీవుడ్ సూపర్ స్టార్ షారుక్ ఖాన్ హీరోగా రాహుల్ ఢొలాకియా దర్శకత్వంలో వచ్చిన రయీస్ సినిమాతో హిందీ సినిమా ఇండస్ట్రీ లోకి కూడా అడుగు పెట్టారు మహిరా ఖాన్.
2006 లో అలీ అస్కరి అనే వ్యక్తిని లాస్ ఏంజిల్స్ లో కలిసారు మహిరా ఖాన్. వారిద్దరి పెళ్లికి మహిరా తండ్రి అంగీకరించలేదు. 2007 లో వాళ్లిద్దరూ పెళ్లి చేసుకున్నారు. 2009 లో వారికి ఒక బాబు పుట్టాడు. 2015 లో వ్యక్తిగత కారణాల వల్ల వాళ్ళిద్దరూ విడిపోయారు. ఇన్ని సంవత్సరాల తన కెరీర్ లో ఎన్నో అవార్డులను అందుకున్నారు మహిరా ఖాన్. నవంబర్ 23 వ తేదీ 2020 లో బిబిసి వాళ్ళు అనౌన్స్ చేసిన హండ్రెడ్ వుమెన్ జాబితాలో చోటు సంపాదించుకున్నారు మహిరా ఖాన్.
End of Article