Home Filmy Adda “రాఘవ లారెన్స్” కి ఏమయ్యింది..? ఇలా మరిపోయారేంటి..?

“రాఘవ లారెన్స్” కి ఏమయ్యింది..? ఇలా మరిపోయారేంటి..?

by Anudeep

కొరియోగ్రాఫర్ నుంచి నటుడుగా మారిన రాఘవ లారెన్స్ గురించి ప్రత్యేకించి ఇంట్రడక్షన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆయన ఎంతో పట్టుదలతో అంచలంచలుగా తన కెరీర్ ని డెవలప్ చేసుకుంటూ వచ్చారు. ప్రస్తుతం లారెన్స్ పోస్ట్ చేసిన ఫోటో ఒకటి నెట్ లో వైరల్ గా మారింది.

రాఘవ లారెన్స్ ప్రస్తుతం రజనీకాంత్ 2005 బ్లాక్ బస్టర్ అయిన చంద్రముఖి మూవీ సీక్వెల్ కోసం తన కంప్లీట్ గెటప్ ను మార్చుకున్నారు. ప్రస్తుతం ఆయన ట్విట్టర్లో చంద్రముఖి 2 కోసం కష్టపడి కండలు పెంచిన ఫోటోను అప్లోడ్ చేశారు.

raghava lawrence latest transformation pictures going viral

హాలీవుడ్ రేంజ్ లో కండలు పెంచి వస్తాదులా ఉన్న లారెన్స్ ని చూసి ఆయన అభిమానులు ఎంతో సంతోషించారు. ఆ ఫోటోతో పాటు లారెన్స్ తన అభిమానుల కోసం ఒక నోట్ ని కూడా షేర్ చేశారు. అందులో ఆయన అందరితో రెండు ముఖ్య విషయాల గురించి తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. మొదటిది చంద్రముఖి 2 కోసం ఆయన తన శరీరాన్ని మలచడానికి తీసుకున్న ఎఫర్ట్స్ . దానితో పాటు అందుకు ఎంతో సహాయం చేసిన ఆయన ట్రైనర్ శివ మాస్టర్ కి ధన్యవాదాలు తెలిపారు.

raghava lawrence latest transformation pictures going viral

ఆయన తన చారిటబుల్ ట్రస్ట్ కు విరాళం ఇచ్చిన తన అభిమానులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఇప్పుడు పరిస్థితులు బాగా ఉన్నాయని, తను తిరిగి మూవీ సైన్ చేస్తున్నాను అని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంలో ఇక ఆయన అభిమానులు ట్రస్ట్ కు విరాళం ఇవ్వడం మానేయాలని కోరుకున్నారు. ఇకనుంచి ట్రస్ట్ కు సంబంధించిన పూర్తి బాధ్యతలు తాను చేపట్టాలని అనుకుంటున్నానని తెలియ పరిచారు. లారెన్స్ పోస్ట్ కి ఆయన అభిమానులు బాగా స్పందించారు.

raghava lawrence latest transformation pictures going viral

ఆయన చేస్తున్న ఈ చిత్రం మంచిగా సక్సెస్ అవ్వాలని ఆకాంక్షిస్తున్నట్లు కొందరు కామెంట్ రూపంలో తమ అభిప్రాయాన్ని తెలిపారు. అయితే ఇటు చంద్రముఖి 2 రిలీజ్ డేట్ గురించి ఇంతవరకు ఎటువంటి స్పష్టత లేదు. చిత్రం షూటింగ్ మైసూర్లో జరిగిన విషయం అందరికీ తెలిసిందే. చంద్రముఖి ఆ రోజుల్లో బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసింది. లక లక లక అంటూ కాసుల వర్షం కురిపించింది. కానీ తెలుగులో చంద్రముఖి సీక్వెల్ గా వచ్చిన నాగవల్లి బాక్సాఫీస్ డిజాస్టర్ గానే మిగిలింది. మరి ఇప్పుడు భారీ అంచనాల మధ్య రాబోతున్న చంద్రముఖి 2 బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డు సృష్టిస్తుందా లేక బోల్తాపడుతుందా వేచి చూడాలి.

You may also like