Ads
Vijay Deverakonda: అర్జున్ రెడ్డి సినిమాతో విజయ్ దేవరకొండ ఓవర్ నైట్ స్టార్ హీరో అయ్యారు. ఆ తరువాత వరుస సినిమాలతో అలరిస్తున్నాడు. అయితే “లైగర్” మూవీతో పాన్ ఇండియా స్టార్ గా మారాలని అనుకున్నాడు. అయితే సినిమా డిజాస్టర్ గా నిలిచింది. ఇది మూవీలో భాగమైన ప్రతీ ఒక్కరినీ తీవ్రంగా దెబ్బ తీసింది.
Video Advertisement
ఎంతగా అంటే ఇదే దర్శకుడు, హీరోల కాంబినేషన్ లో కొంత షూటింగ్ కూడా చేసిన ‘JGM’ మూవీని పక్కన పెట్టేసే అంత. రౌడీ హీరో “లైగర్” ఫ్లాప్ తరువాత కొద్ది రోజుల పాటు సైలెంట్ అయ్యాడు. అయితే ఈమధ్యే మళ్ళీ మీడియాలో కనిపిస్తున్నాడు. కానీ విజయ్ దేవరకొండ స్నేహితులు రాహుల్ రామకృష్ణ మరియు ప్రియదర్శి మాత్రం ఈ పరాజయం అతని మీద ఏమాత్రం ప్రభావం చూపదని చెబుతున్నారు.
రాహుల్ రామకృష్ణ మరియు ప్రియదర్శి తాజాగా ఏబీఎన్ రాధా కృష్ణ షోలో పాల్గొన్నారు. ఆర్కే ఈ సందర్భంగా మాట్లాడుతూ “సినిమా ఇండస్ట్రీ రంగులరాట్నం లాంటిది. ఏమరపాటున ఉంటే చాలా ప్రమాదకరమైందని, అది ఎంత పైకి తీసుకెళ్తుందో, అంతే వేగంగా కింద పడేస్తుందని, ఇదే విజయ్ దేవరకొండ ‘లైగర్’ విషయంలో జరిగింది. ఓవర్ నైట్ స్టార్ గా మరి ఎక్కడికో వెళ్ళిపోయాడు. కానీ అలానే టక్కున కిందికి రావాల్సి వచ్చిందని చెప్పాడు.
అయితే దీనికి రాహుల్ రామకృష్ణ స్పందిస్తూ మేము ఇద్దరం కలిసి ‘ఖుషి’ మూవీ చేస్తున్నాం. కానీ సమంతకు ఆరోగ్యం బాలేకపోవడంతో హోల్డ్ లో వుంది. నెక్స్ట్ షెడ్యూల్ మొదలవగానే విజయ్ దేవరకొండని కలుస్తాను. అయితే ఈమధ్య కాలంలో మాట్లాడుకోలేదు. హి ఈజ్ మేడ్ ఆఫ్ స్టీల్. ఏదైనా తట్టుకుంటాడు అని అన్నాడు. ప్రియదర్శి విజయ్ దేవరకొండ గురించి మాట్లాడుతూ హిట్ అండ్ ఫ్లాప్ అనేవి కామన్, విజయ్ చాలా డిఫరెంట్, అతను ఖచ్చితంగా మళ్లీ హిట్టు కొడతాడని అన్నారు.
మరోవైపు విజయ్ కూడా చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నటు కనిపిస్తున్నాడు. ఈ మధ్య జరిగిన ఒక ఈవెంట్ లో మాట్లాడుతూ అందరు ఎక్కడికి వెళ్ళినా కంబ్యాక్ ఇవ్వాలి అన్నా అంటున్నారని, అయితే తాను ఎక్కడికీ పోలేదని, ఇక్కడే ఉన్నానని తన స్టైల్లో చెప్పి ఫ్యాన్స్ ని ఉత్సాహపరిచాడు.
End of Article