ఆనంద్ సినిమాలో “రాహుల్” పాత్రలో నటించిన యాక్టర్ ఇప్పుడు ఎలా ఉన్నాడో తెలుసా..? అతను ఎవరంటే..?

ఆనంద్ సినిమాలో “రాహుల్” పాత్రలో నటించిన యాక్టర్ ఇప్పుడు ఎలా ఉన్నాడో తెలుసా..? అతను ఎవరంటే..?

by kavitha

Ads

శేఖర్ కమ్ముల దర్శకత్వం చేసే చిత్రాలు తక్కువ బడ్జెట్ తో తెరకెక్కే చిన్న చిత్రాలు అయినా వాటిలో ఎదో తెలియని కొత్తదనం ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. ఆయన సినిమాలు కేవలం క్లాస్ ప్రేక్షకులే కాకుండా మాస్ ప్రేక్షకులను కూడా ఎంతగానో ఆకట్టుకుంటాయి.

Video Advertisement

అయితే శేఖర్ కమ్ముల తెరకెక్కించిన ఉత్తమ చిత్రాలలో ఆనంద్ మూవీ ఒకటి. ఒక మంచి కాఫీ లాంటి సినిమా అనే  క్యాప్షన్‏ తో తెరకెక్కిన ఈ మూవీ దానికి తగినట్టుగా హృదయాలను హత్తుకునే సినిమా. కమ్ముల దర్శకత్వం వహించిన ఈ మూవీ 2004లో రిలీజ్ అయ్యి, సూపర్ హిట్ గా నిలిచింది.
anand-movie జీవితంలో ప్రధానమైన ప్రేమ, ఆత్మాభిమానం వంటి అంశాలను కమ్ముల వెండితెరపై అద్భుతంగా ఆవిష్కరించారు. భారీ తారాగణం లేకుండా, ఎక్కువగా కొత్తవాళ్ళతో, సాదాసీదా కథనంతో రూపొందిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర ఊహించని విజయం అందుకుంది. ఈ చిత్రంలో రాజా, కమలినీ ముఖర్జీ హీరో హీరోయిన్లుగా నటించారు. హీరోయిన్ కమలిని ఈ మూవీతో తెలుగు ఆడియెన్స్ కు దగ్గరయ్యింది. చిన్నతనంలోనే అమ్మనాన్నలను కోల్పోయి, స్నేహితుల సహాయంతో జీవితాన్ని కొనసాగించే రూప పాత్రలో జీవించి, విమర్శకుల, ఆడియెన్స్ ప్రశంసలు అందుకుంది. ఈ చిత్రంలో హీరోయిన్ ప్రేమించి, పెళ్లి చేసుకోవాలనుకుని, అటు అమ్మకు, ఇటు కాబోయే భార్యకు నచ్చచెప్పే  పాత్రలో నటించిన నటుడి పేరు అనుజ్ గుర్వారా. ఇతను నటుడు మాత్రమే కాదు నేపథ్య గాయకుడు, వాయిస్ ఆర్టిస్ట్, రేడియో జాకీ మరియు టెలివిజన్ షో హోస్ట్. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, కాజల్ అగర్వాల్ నటించిన మగధీర సినిమాలో పంచదార బొమ్మ బొమ్మ పాటను అనుజ్ పాడారు.
ఈ పాటకు గాను అతను ఫిల్మ్‌ఫేర్ అవార్డును అందుకున్నాడు. ఈ చిత్రంలోనే కాకుండా ఎన్నో తెలుగు హిట్ సాంగ్స్ ను ఆలపించారు. వాటిలో బద్రీనాథ్, వేదం, భీమిలి కబడ్డీ జట్టు, ఝుమ్మంది నాదం, అనగనగా ఓ ధీరుడు, ప్రేమ కావాలి వంటి అనేక చిత్రాలు ఉన్నాయి. హిందీలో కూడా పలు సాంగ్స్ ను ఆలపించారు. సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉండే అనుజ్ గుర్వారాకు ఇన్ స్టాగ్రామ్ లో 5 వేలకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు.

https://www.instagram.com/p/Cg_N9_ihfFJ/

Also Read: FLOP MOVIES IN TELUGU: 2023 లో వచ్చిన 12 “వరస్ట్ సినిమాలు” ఇవే..! ఏవి ఉన్నాయంటే..?


End of Article

You may also like