Ads
రాహుల్ రవీంద్రన్ హనూ రాఘవపూడి దర్శకత్వంలో వచ్చిన ‘అందాల రాక్షసి’చిత్రంతో చాలా మంది లేడీ ఫ్యాన్స్‌ను ఏర్పరుచుకున్నాడు. ఆ తరువాత పలు సినిమాలలో హీరోగా నటించాడు. తెలుగు, తమిళ, ఇంగ్లీష్ సినిమాలలో నటించాడు. దర్శకుడుగా మరి రెండు సినిమాలను తెరకెక్కించాడు. రాహుల్ రవీంద్రన్, సింగర్ చిన్మయిని ప్రేమ వివాహం చేసుకున్నారు.
Video Advertisement
ఇటీవల ఉత్తరప్రదేశ్ పీసీఎస్ జ్యోతి మౌర్య కేసు సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. దీనిపై సింగర్ చిన్మయి కూడా స్పందించారు. ఆ తరువాత ఆమెను, భర్త రాహుల్ రవీంద్రన్ ట్యాగ్ చేస్తూ నెటిజెన్లు కామెంట్స్ పెడుతున్నారు. దాంతో నటుడు రాహుల్ రవీంద్రన్ తాజాగా వాటి పై స్పందిస్తూ ట్వీట్ చేశాడు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..ఉత్తరప్రదేశ్ ప్రయాగ్‌రాజ్‌కు చెందిన అలోక్ మౌర్య తన భార్యను చాలా కష్టపడి చదివించి ఆమె కల అయిన ప్రభుత్వ ఉద్యోగం సాధించేలా చేశాడు. తీరా సబ్ డివిజినల్ మేజిస్ట్రేట్ జాబ్ వచ్చిన తరువాత ఆమె అతడిని మోసం చేసింది. పైగా అతడి పై వరకట్నం కేసు పెట్టి జైలుకు పంపించింది. ఈ విషయం పై ఎంతోమంది సోషల్ మీడియాలో కామెంట్ చేశారు. ఈ క్రమంలో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే చిన్మయి కూడా స్పందించారు. నెటిజెన్లు ఆమెను, రాహుల్ రవీంద్రన్ ట్యాగ్ చేస్తూ కామెంట్స్ చేస్తూన్నారు. దీనిపై తాజాగా రాహుల్ రవీంద్రన్ ట్విట్టర్ లో ఇలా చెప్పుకొచ్చారు.
“మీరు అందరూ ఆమెతో పోరాడిన తరువాత నన్ను ట్యాగ్ చేస్తూనే ఉన్నారు. ఆమె ఎత్తి చూపుతున్న మైండ్ సెట్ ప్రాబ్లెమ్స్ గురించి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. మీరు అంగీకరించినా, అంగీకరించకపోయినా, ఆమె మాట వినండి. ఆ పై ఆమెకు కొంచెం ప్రేమను ఇవ్వడానికి ప్రయత్నించండి. ఆమె మీ పై ప్రేమను కురిపిస్తుంది. ఆమె మీకు ఇష్టమైన అక్కగా మారుతుంది.
నాకు లభించిన అతి పెద్ద ఆశీర్వాదాలలో ఆమె కూడా ఒకటి. ఆమె పరిమితి లేకుండా ప్రేమిస్తుంది. మరియు మీకు భరోసా ఇస్తుంది. ఇతరుల వైపు నుండి సమస్యలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే, మీ జీవితంలో ఉన్న స్త్రీలు మిమ్మల్ని ఎంతో ప్రేమిస్తారు. మరియు మీరు మీ కంటే ఎక్కువగా వారిని గౌరవించండి. అప్పుడు ప్రపంచం ఎంత అందంగా ఉంటుందో మీకు తెలియదు” అని చెప్పుకొచ్చారు.
Also Read: “ఆదిపురుష్” లో ప్రభాస్ ఎంట్రీ సీన్ రిహార్సల్ వీడియో చూశారా..? ఇలా షూట్ చేసారా..?
End of Article