కృపయా ధ్యాన్ దే… ప్రయాణికులకు విజ్ణప్తి.. ఈ రూల్స్ ప్రకారమే మీ ప్రయాణాన్ని డిసైడ్ చేస్కోండి.

కృపయా ధ్యాన్ దే… ప్రయాణికులకు విజ్ణప్తి.. ఈ రూల్స్ ప్రకారమే మీ ప్రయాణాన్ని డిసైడ్ చేస్కోండి.

by Anudeep

Ads

కృపయా ధ్యాన్ దే.. ప్రయాణికులకు విజ్ణప్తి.. సుమారు రెండు నెలల తర్వాత రైలుబండ్లు పట్టాలెక్కనున్నాయి..జూన్ 1న ప్రారంభం కాబోయే రైళ్ల రవాణాకు సంబంధించి  రైల్వేశాఖ అన్ని రకాల ఏర్పాట్లు చేస్తోంది.. ప్రయాణికులకు సంబంధించి కొన్ని నియమాలను తయారు చేసింది..  రైల్వే వారు సూచించిన నియమాల ప్రకారమే ప్రయాణికులు ప్రయాణం చేయాల్సి ఉంటుంది.. ఆ నియమ నిబంధనలను బట్టే మీ ప్రయాణ షెడ్యూల్ ని మార్చుకోవాల్సి ఉంటుంది..ఇంతకీ ఆ రూల్స్ ఏంటో తెలుసుకోండి..

Video Advertisement

రైలు ప్రయాణానికి పాటించాల్సిన నియమాలు…

  • రైలు ప్రయాణ సమయానికి గంట ముందు స్టేషన్‌లో ఉండాలి.
  • మాస్క్‌ ధరించడం తప్పనిసరి,  శానిటైజర్‌ దగ్గర ఉంచుకోవాలి.
  • ఏసీ ప్రయాణికులు అవసరమైన దుప్పట్లు , ఎవరివి వారే తెచ్చుకోవాలి.
  • 60 ఏళ్లు దాటిన వారు, పదేళ్ల లోపు వారు ప్రయాణాలు చేయకపోవడమే మంచిది.
  • రైల్లో ప్యాక్డ్‌ ఫుడ్‌, వాటర్‌ బాటిల్‌ ఇస్తారు..అయినప్పటికి ఇంటి నుండి ఆహారం తీసుకుని వెళ్లడం ఉత్తమం.

ప్రయాణికులను మాత్రమే స్టేషన్‌లోకి అనుమతిస్తారు. అది కూడా మీ దగ్గర కన్ఫర్మేషన్‌ టిక్కెట్‌ ఉంటేనే, ఆర్‌ఏసీ, వెయిటింగ్‌ లిస్ట్‌ ఉన్నవారికి స్టేషన్ లోపలికి అనుమతి లేదు.. ప్రయాణికులకు తోడుగా బం దువులు, కుటుంబ సభ్యులు, స్నేహితులు రావడానికి వీలు లేదు. ఒకవేళ వారు వచ్చినా స్టేషన్‌ బయట నుంచే వెళ్ళిపోవాల్సుంటుంది.

ప్రయాణం పూర్తయ్యాక పాటించాల్సిన నియమాలు..

ఎపి నుండి తెలంగాణాకి వచ్చే వారు తెలంగాణా నియమనిబంధనల్ని పాటించాలి.. టిజి నుండి ఎపికి వెళ్లేవాళ్లు ఆ రాష్ట్ర రూల్స్ పాటించాల్సిందే.. 14రోజుల క్వారంటైన్ ఖచ్చితంగా పాటించి తీరాల్సిందే..  స్టేషన్‌లో రైలు దిగిన వెంటనే  థర్మల్‌ స్ర్కీనింగ్‌ ద్వారా టెంపరేచర్ చెక్ చేస్తారు.  టెంపరేచర్‌ ఎక్కువగా ఉంటే  ఇన్స్టిట్యూషనల్( ప్రభుత్వ) క్వారంటైన్, లేదంటే ఇంటికి పంపిస్తారు.. ఇంటికి వెళ్లిన వాళ్లు కచ్చితంగా 14 రోజులు హోం క్వారంటైన్లో ఉండాల్సిందే.. ఐసోలేషన్ కి వెళ్లినవాళ్లు ముందు 14రోజులు హాస్పిటల్లో, తర్వాత నయం అయి ఇంటికి వెళ్తే మరో 14రోజులు హోం క్వారంటైన్లో ఉండాలి.

ముఖ్యమైన పనులున్నా క్వారంటైన్ తప్పనిసరి..

ముఖ్యమైన పనులున్న వాళ్లు కూడా క్వారంటైన్లో ఉండాల్సిందేనా అనేది  చాలా మంది ప్రశ్న.. ఖచ్చితంగా ఉండాల్సిందే..మీకెంతటి ముఖ్యమైన పనులున్నా 14రోజుల క్వారంటైన్ పీరియడ్ ముగిసిన తర్వాతనే ఆ పనులు చూసుకోవాలి..అలా కాకుండా ఆ 14రోజుల కాల వ్యవధిలో పనులు చూస్కుంటామంటే కుదరదు.

ఒక్కో రాష్ట్రంలో ఒక్కో పద్దతిలో క్వారంటైన్..

  • తెలంగాణాలో హైదరాబాద్‌ సహా ఏ జిల్లాకు వెళ్లినా…మొదటి 14 రోజులు ఇన్‌స్టిట్యూషనల్‌ క్వారంటైన్‌లో ఉండాలి. ఆ తరువాత మరో 14 రోజులు హోమ్‌ క్వారంటైన్‌లో ఉండాలి. అంటే 28 రోజులు ఎవరినీ కలవకూడదు. దీనికి ఒకె అనుకుంటేనే ప్రయాణం చేయాలి..
  • బెంగళూరులో చాలా మంది తెలుగు వారు ఉద్యోగాల్లో ఉన్నారు..వారిని కలవడానికి వెళ్లడానికి అనేకమంది కుటుంబ సభ్యులు ఎదురు చూస్తున్నారు. ఆ రాష్ట్ర నిబంధనల ప్రకారం మొదటి 14రోజులు పెయిడ్ క్వారంటైన్లో, తర్వాత 7రోజులు హోంక్వారంటైన్లో ఉండాలి..పెయిడ్ క్వారంటైన్ అంటే మనమే డబ్బులిచ్చి ఏర్పాటు చేసుకోవాలి. మొత్తం 21రోజుల తర్వాత మాత్రమే మీ మీ బంధువులని కలవడానికి వీలుంటుంది.
  • తమిళనాడులో మొదటి 14 రోజులు పెయిడ్‌ క్వారంటైన్‌లో ఉండాలి.ఆ తరువాత వారం రోజులు ఇంట్లో ఉండాలి.
  • ఎవరైనా ఒడిశా రాష్ట్రానికి వెళితే 21 రోజులు హోమ్‌ క్వారంటైన్‌లో ఉండాలి. ఆ సమయంలో ఎటువంటి లక్షణాలు లేకపోతే అప్పుడు బయట తిరగొచ్చు..

రైళ్ల వివరాలు..

ఐదు రైళ్లు మాత్రమే తిరగనున్నాయి..

  • గోదావరి ఎక్స్ ప్రెస్
  • ఏపి ఎక్స్ ప్రెస్
  • ఫలక్ నుమా ఎక్స్ ప్రెస్
  • బొకారో ఎక్స్ ప్రెస్
  • కోణార్క్ ఎక్ప్ ప్రెస్

ఇవి రైలు ప్రయాణంలో , ప్రయాణం తర్వాత పాటించాల్సిన నియమాలు.. తిరిగే రైళ్ల వివరాలు..వీటిని బట్టి మీ ప్రయాణాలను ఫిక్స్ చేసుకోండి…

 

 

 

 

 


End of Article

You may also like