కరోనా వైరస్ మహమ్మారి కారణంగా యావత్ భారతదేశం మొత్తం లాక్ డౌన్ ని పాటిస్తుంది.ప్రస్తుతం మూడవ దశ లాక్ డౌన్ నడుస్తుంది ఈ మూడవ దశ లాక్ డౌన్ మే ౧౭ వరకు కొనసాగుతుంది .కేంద్ర ప్రభుత్వం కొన్ని వెసులుబాట్లు కలిపిస్తూ గ్రీడ్,ఆరంజ్,రెడ్ జోన్లుగా విభజించింది.ప్రజలు బయటకు రాకుండా కఠిన లాక్ డౌన్ నియమాలు విధించారు పోలీసులు.ఎంత కఠినంగా లాక్ డౌన్ కొనసాగిస్తున్నపటికి కొందరు ఏదో ఒక కారణం చేత బయటకు వస్తూనే ఉన్నారు..లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తూనే ఉన్నారు..సమస్య తీవ్రత అర్థం చేసుకోకుంటే ఎవరికి నష్టం చెప్పండి ? మనం కూడా పొలిసు శాఖ వారికి సహకరించి తీరాల్సిందే కదా..

Video Advertisement

ఛత్తీస్‌గడ్ రాజధాని రాయ్‌పూర్‌లో లాక్ డౌన్ కొనసాగుతున్నపటికీ కూడా ఒక యువకుడు లాక్ డౌన్ నిబంధనను అతిక్రమించాడు …ఎలాంటి పని లేకుండానే బయటకు రావడం మాత్రమే కాకుండా అతను తన ఫేస్ బుక్ పేజీలో బిఎమ్‌డబ్ల్యూ కారులో కూర్చుని లైవ్ ఇచ్చాడు కూడా.. .రాయ్‌పూర్‌లో పొలిసు శాఖ వారు ఎలాంటి మినహాయింపులు ఇవ్వలేదు కాబట్టి కార్లు,బైకులు వంటి వాటితో రోడ్ల మీద తిరగకూడదు. ఈ నిబంధలను ఉల్లఘించటం వలన అతన్ని  అదుపులోకి తీసుకున్నారు.అతన్ని అరెస్ట్ చేయడమే కాకుండా…వాహనం సీజ్ చేయటం తో పాటు పోస్ట్ డిలీట్ చేయమన్నారు.

ఇలాంటి తరహా పొరపాట్లు మళ్ళీ ఇంకెవరి ద్వారా అయినా పునరావృతం అయితే కఠిన చర్యలు ఉంటాయంటున్నారు పోలీసులు.యువకుడి పేరుని అభినయ్ సోనిగా గుర్తించామన్నారు. ఈ యువకుడు క్షమాపణలు చెప్పే ఫొటోస్ ని ఫేస్ బుక్ ద్వారా పోస్ట్ చేయించారు రాయ్‌పూర్ ఎస్పీ ఆరిఫ్ షేక్.  దీని గురించి ట్వీట్ చేస్తూ,లాక్ డౌన్ నిభందనలను ప్రతి ఒక్కరు తప్పక పాటించాలని కోరారు. లేకపోతే ఇంత కంటే కఠినంగా శిక్షలు ఉంటాయంటూ హెచ్చరించారు .