గ్లోబల్‌ బాక్సాఫీస్‌ వద్ద అవార్డులు దక్కించుకొని టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీగా నిలుస్తోంది ఆర్‌ఆర్‌ఆర్. ఎస్‌ఎస్‌ రాజమౌళి ‌దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ రూ.1100 కోట్లకుపైగా వసూళ్లు చేసి నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది. వివిధ విభాగాల్లో పురస్కారాలు సైతం అందుకుంది ఆర్‌ఆర్‌ఆర్‌. కాగా డైరెక్టర్‌ ఎస్‌ఎస్‌ రాజమౌళి మరో పురస్కారాన్ని ఖాతాలో వేసుకున్నాడు. ఎన్టీఆర్ ,రామ్ చరణ్‌లు ప్రధాన పాత్రల్లో ఆర్‌ఆర్‌ఆర్ చిత్రం వచ్చిన విషయం తెలిసిందే.

Video Advertisement

 

‘ఆర్ఆర్ఆర్’ సినిమా భారతీయ ప్రేక్షకులతో పాటు ప్రపంచ సినీ అభిమానులను సైతం మెప్పించింది. ప్రపంచ చలన చిత్ర రంగం లో ప్రతిష్టాత్మకంగా భావించే న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ అవార్డును సొంతం చేసుకున్నారు రాజమౌళి. తాజాగా ఉత్తమ దర్శకుడి అవార్డును రాజమౌళి తన భార్య రమాతో కలిసి అందుకున్నారు. ఈ వేడుకకు జక్కన్న పంచ కట్టులో హాజరయ్యారు. ఇప్పటికే ఆర్ఆర్ఆర్ సినిమా జపాన్ సహా పలు ప్రాంతాల్లో విడుదలై సంచలన విజయం సాధించింది. ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందించగా.. సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫిని అందించారు. ఈ మూవీ ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌, జీ 5, హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.

rajamouli gets new york critics award..

అవార్డు అందుకున్న సందర్భంగా రాజమౌళి మాట్లాడుతూ.. ” ట్రిపుల్ ఆర్ సినిమాకు ఉత్తమ దర్శకుడిగా ఈ ప్రతిష్టాత్మక అవార్డు అందుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈ వేదికపై అందరి ముందు మాట్లాడడం కాస్త కంగారుగానే అనిపిస్తుంది. సినిమా అంటే ఓ దేవాలయం. చిన్నప్పుడు థియేటర్లో సినిమా చూసేందుకు వెల్లినప్పుడు పొందిన ఆనందం ఇప్పటికీ గుర్తుంది. థియేటర్లో ఈ సీన్ ఎలా ఉంటుంది అని ఓ ప్రేక్షకుడిగా ఊహించుకుని.. తర్వాత సీన్ చిత్రీకరిస్తాను.” అని రాజమౌళి వెల్లడించారు.

rajamouli gets new york critics award..

తన కుటుంబం గురించి రాజమౌళి మాట్లాడుతూ..” నా సినిమాలకు పనిచేసే ముఖ్యమైన వ్యక్తులందరూ నా కుటుంబసభ్యులే. నా తండ్రి విజయేంద్ర ప్రసాద్ కథలు రాస్తుంటారు. పెద్ద అన్యయ్య ఎంఎం కీరవాణి సంగీత దర్శకుడిగా.. నా భార్య రమ కాస్ట్యూమ్ డిజైనర్ గా.. నా తనయుడు కార్తికేయ.. వదిన వల్లి లైవ్ ప్రొడ్యూసర్లుగా… సోదరుడి కుమారుడు కాలభైరవ గాయకుడిగా.. మరో సోదరుడు రచయితగా ఇలా వీళ్లంత నన్ను ఎప్పటికప్పుడు ప్రోత్సహిస్తూనే ఉన్నారు. నా కుటుంబానికి ఎప్పటికీ రుణపడి ఉంటాను. రామ్ చరణ్, ఎన్టీఆర్ కు ధన్యవాదాలు” అని చెప్పుకొచ్చారు రాజమౌళి.

rajamouli gets new york critics award..

ఆర్ఆర్ఆర్ సినిమాకి ఇతర దేశాల నుంచి విశేష ఆదరణ లభించింది. ఫిల్మ్ సెలబ్రిటీలు, మేకర్స్ దీనిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. అదే సమయంలో అవార్డుల పంట పండుతుంది. వరుసగా అంతర్జాతీయ అవార్డులు వరిస్తున్నాయి. ఇప్పటికే ఆస్కార్‌ బరిలో ఉంది `ఆర్‌ఆర్‌ఆర్‌`. సాంగ్స్, నటులు, దర్శకుడు విభాగాల్లో ఆస్కార్ వరించే అవకాశం ఉందంటున్నారు. వీటితోపాటు గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డులు కూడా దక్కే ఛాన్స్ ఉంది.