రామాయణం తీయండి అని ట్రెండ్ అయిన ట్వీట్స్ కి…రాజమౌళి రిప్లై ఇదే.!

రామాయణం తీయండి అని ట్రెండ్ అయిన ట్వీట్స్ కి…రాజమౌళి రిప్లై ఇదే.!

by Anudeep

Ads

టాలీవుడ్ దర్శక ధీరుడు ‘రాజమౌళి’ ఆయనతో సినిమా చెయ్యాలి అని ప్రతి హీరో పరితపిస్తుంటారు అన్నది వాస్తవమే..హీరో ఫాన్స్ కూడా తమ హీరో రాజమౌళి తో ఒక్కసారైనా చేస్తే చూడాలని ఉంది అని అనుకుంటుంటారు.బాహుబలితో తెలుగు సినిమా సామర్త్యాన్ని ప్రపంచ దశ దిశలా వ్యాపింపచేసిన జక్కన్న ..తన తదుపరి సినిమా ‘ఆర్ ఆర్ ఆర్’ మీదే ప్రస్తుతం ద్రుష్టి పెట్టారు..దాదాపు 80 శాతం సినిమా ఇప్పటికే పూర్తి చేసుకుంది..కరోనా వలన లాక్ డౌన్ కారణంగా ప్రస్తుతం షూటింగ్స్ అన్ని వాయిదా వేసుకున్న సంగతి తెలిసిందే.

Video Advertisement

 

 

ఇకపోతే ‘ఆర్ ఆర్ ఆర్’ తరువాత నెక్స్ట్ సినిమా ఏంటో ఈ మధ్యే క్లారిటీ ఇచ్చారు జక్కన్న …తన సినిమా మహేష్ బాబు తో ఉండబోతుంది అని..ఇప్పటికే ప్రకటించారు..దీనితో మహేష్ ఫాన్స్ లో సంబరాలు మొదలయ్యాయి.ఇకపోతే తన డ్రీం ప్రాజెక్ట్స్ అయినా ‘రామాయణం’& ‘మహా భారతం’ లాంటి పౌరాణిక చిత్రాలు..తీయాలని తనకు ఉంది అని..చెప్పిన సందర్భాలు ఎన్నో.ఇటీవలే బాలీవుడ్ ఫాన్స్ సైతం ట్విట్టర్ ట్రెండ్ కూడా చేసారు రాజమౌళి రామాయణం తీయాలని..బాలీవుడ్ ఫాన్స్ సైతం …ఇంతలా పరితపిస్తున్నారు అంటే ఆయనకు ఉన్న ఫాలోయింగ్ ఎలాంటిదో మనం అర్థం చేసుకోవచ్చు.ఇటీవలే ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ నిజగానే మహాభారతం తీయాలన్నది నా కల ఎప్పటికైనా తెరకెక్కించి తీరాలి ఆ ప్రాజెక్ట్ పనులు మొదలు పెట్టాలి.అని చెప్పుకొచ్చారు ఉన్నఫళంగా కూర్చొని చేసే ప్రాజెక్ట్ అయితే కాదది చాలా శక్తి సామర్థ్యాలు పెంపొందించుకోవాలి పూర్తిగా దానిపైనే ద్రుష్టి పెట్టాలి ఇపుడున్న పరిస్థితుల్లో అది చేయలేమని తెలిపారు…


End of Article

You may also like