రాజన్న సిరిసిల్ల జిల్లా లో సంచలనం సృష్టించిన యువతి షాలిని కిడ్నాప్ కేసు లో తాజాగా ఊహించని ట్విస్ట్ వెలుగు చూసింది. ప్రేమించిన వ్యక్తి తో పెళ్లి కోసం షాలిని నే కిడ్నాప్ డ్రామా ఆడించినట్లు వెల్లడైంది. ఈ మేరకు ఆ యువతి ఒక వీడియో విడుదల చేసింది. చందుర్తి మండలం మూడపల్లి లో కారులో వచ్చిన దుండగులు తండ్రిని తోసేసి.. షాలిని అనే యువతిని తీసుకెళ్లిన విషయం తెలిసిందే. సీసీ కెమెరాలో రికార్డు అయిన దృశ్యాలు కలకలం సృష్టించాయి.

Video Advertisement

 

 

అయితే అంతా అనుకుంటున్నట్లుగానే ఎవరు తనని కిడ్నాప్ చెయ్యలేదని షాలిని వీడియో రిలీజ్ చేసి.. అందర్నీ షాక్ కి గురిచేసింది. ” నేను, జానీ అనే వ్యక్తిని నాలుగేళ్లుగా ప్రేమిస్తున్నా.. ఏడాది క్రితం పెళ్లి చేసుకున్నాం. అప్పుడు మెం ఇద్దరం మైనర్లం కాబట్టి ఆ పెళ్లి చెల్ల లేదు. కేసు పెట్టి మా నాన్న నన్ను తీసుకొచ్చేసారు. జానీ దళితుడన్న కారణం తో మా పెళ్ళికి ఒఇప్పుకోలేదు. నాకు వేరే సంబంధం చూసారు. దీంతో నేను ఫోన్ చేయడం తో జానీ వచ్చి నన్ను తీసుకెళ్లాడు. ముందు మాస్క్ పెట్టుకొని ఉండటం తో ఎవరో అనుకున్నా.. ఇప్పుడు నా ఇష్ట ప్రకారమే పెళ్లి చేసుకున్నా.. నా కుటుంబం నుంచి మాకు రక్షణ కల్పించండి.” అని ఆ వీడియో లో షాలిని పేర్కొంది.

kdinap case in rajanna siricilla got a twist..

అంతకుముందు తన తండ్రి తో గుడికి వెళ్లిన షాలిని ని బలవంతం గా తీసుకెళ్లడంతో ప్రేమ పేరుతో యువతిని వేధించిన జాన్ అనే యువకుడే కిడ్నాప్ చేసాడని ఆమె తండ్రి పోలీసులను ఆశ్రయించాడు. అంతకు క్రితం వారిద్దరూ పెళ్లి చేసుకున్న నేపథ్యం లో అతడు పది నెలలు జైలు శిక్ష కూడా అనుభవించాడు. అయితే జైలు నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ షాలిని, జాన్ దగ్గరవుతుండటం తో వేరే సంబంధం చూసారు షాలిని తల్లిదండ్రులు. దీంతో ఈ కిడ్నాప్ డ్రామా ఆడినట్లు సమాచారం.

 

kdinap case in rajanna siricilla got a twist..

అయితే సిసి టీవీ లో నమోదైన దృశ్యాలు వైరల్ కావడం తో .. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తం గా సంచలనం సృష్టించింది. గవర్నర్ తమిళి సై, మంత్రి కేటీఆర్ ఈ ఘటనపై దర్యాప్తుకు ఆదేశించారు.