Ads
తెలంగాణ ఎన్నికలలో భాజపా ఘోరమైన ఓటమిని చవిచూస్తే రాజస్థాన్ లో మాత్రం ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. అయితే ఈ క్రమంలో రాజస్థాన్ రాజకీయ ఫలితాలలో కొన్ని ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి. కుటుంబ సభ్యుల మధ్య రాజకీయ పోరు ఒకరిని గెలిపిస్తే మరొకరిని ఇంటి ముఖం పట్టేలాగా చేసింది. అలాంటి బంధువులు ఈ ఎన్నికలలో ఎవరు గెలిచి అధికారాన్ని చేజిక్కించుకున్నారో, ఎవరు ఓటమిపాలై ఇంటి ముఖం పట్టారో చూద్దాం.
Video Advertisement
రాజస్థాన్ లోని ధోల్ పూర్ లో కాంగ్రెస్ కి చెందిన శోభారాణి కుష్వాహ కాంగ్రెస్ తరపున పోటీ చేయగా ఆమె సోదరుడు శివ చరణ్ కుష్వాహ భాజపా తరఫున పోటీ చేశారు. అయితే ఈ విజయంలో సోదరుడిపై ఘనవిజయాన్ని సాధించి అధికారపీఠం దక్కించుకుంది శోభారాణి. అలాగే జైపూర్ లోని ఫూలేరా అసెంబ్లీ స్థానం నుంచి కాంగ్రెస్ తరపున విద్యాధర చౌదరి పోటీ చేయగా భాజపా నుంచి ఆయన అల్లుడు శైలేష్ సింగ్ పోటీ చేశారు. ఈ పోటీలో అల్లుడు మీద మామగారు గెలిచి అధికారి పీఠం దక్కించుకోవడం విశేషం.
అలాగే రాజస్థాన్ లోని సీకార్ జిల్లాలో గల దంతారాంఘడ్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా వీరేంద్ర సింగ్ పోటీ చేయగా ఆయనకు ప్రత్యర్థిగా భాజపా నుంచి ఆయన భార్య రీటా సింగ్ పోటీ చేశారు. ఈ పోటీలో భర్త వీరేంద్ర సింగ్ విజయం దక్కించుకున్నారు.
అలాగే మార్వార్ ప్రాంతంలో కాంగ్రెస్ సీనియర్ నేత రిచ్ పాల్ మిర్థా కుమారులు ఇద్దరు కాంగ్రెస్ తరపున పోటీ చేయగా ఇద్దరూ ఓటమి పాలవటం గమనార్హం. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తరువాత సీఎం అశోక్ గెహ్లాట్ రాజీనామా చేశారు. రాష్ట్రంలో భాజపా ప్రభుత్వ ఏర్పాటుకు సన్నాహాలు ప్రారంభమయ్యాయి. రాజస్థాన్ లో 199 స్థానాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగగా అందులో 70 సీట్లు కాంగ్రెస్ కి, 14 సీట్లు స్వాతంత్ర అభ్యర్థులు దక్కించుకోగా 115 సీట్లు భాజపా సాధించి ఘనవిజయాన్ని సొంతం చేసుకోవటం విశేషం.
End of Article