రోడ్డు మీదకి వస్తే ఎలాంటి వెరైటీ శిక్ష వేస్తున్నారో తెలుసా? మనదగ్గర కూడా ఫాలో అయితే బెస్ట్.!

రోడ్డు మీదకి వస్తే ఎలాంటి వెరైటీ శిక్ష వేస్తున్నారో తెలుసా? మనదగ్గర కూడా ఫాలో అయితే బెస్ట్.!

by Anudeep

Ads

శబ్బాష్ .. రాజస్థాన్ పోలీస్.. భలే మంచి పని చేశారు. నేను ముందు నుండి చెప్తునే ఉన్నా ? సర్ ఎందుకు మీకు చెడ్డపేరు, పనీ పాట లేకుండా రోడ్లపైకి వచ్చేవాళ్లని తీసుకెళ్లి ఆ క్వారంటైన్ వార్డుల్లో పడేయండి. అక్కడ కరోనా పేషెంట్ కి ట్రీట్మెంట్ ఇచ్చే డాక్టర్లకి సేవ చేయించండి అని.. రాజస్థాన్ పోలీసులు ఇప్పుడు అదే ఫాలో అవుతున్నారు. మన దగ్గర కూడా ఇదే అమలు చేస్తే బాగుంటుంది అని జనాలు  కోరుకుంటున్నారు.

Video Advertisement

బయటికి వస్తే పోలీసులు వాతలు తేలేటట్టు కొడుతున్నారని వాపోతున్నారు చాలామంది. మరి బయటికి ఎందుకొస్తున్నట్టు అంటే సమాధానం ఉండదు. బిస్కట్లు కొనుక్కోవడానికి ఒకడు, పిల్లలు పాలకూర అడిగాడని ఒకడు, జనాలు లాక్ డౌన్ ఫాలో అవుతున్నారా లేదా చూడ్డానికి వచ్చానని మరొకడు. అసలు మనోళ్లు ఎంత బుద్ది లేనోళ్లో ఈ సిల్లీ రీజన్స్ చూస్తే అర్దం అయిపోతుంది.

ఇప్పటికి దేశంలో కరోనా కేసుల సంఖ్య 900 దాటింది. మొన్నొక రోజే మన రాష్ట్రంలో పదిహేను కేసులు నమోదయ్యాయి. ప్రభుత్వాలు ఎక్కడిక్కడ కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నాయి. అత్యవసరం అయితే తప్ప బయటికి రాకండి అని సాక్షాత్తూ ముఖ్యమంత్రే మన బాగు కోరి చేతులెత్తి మొక్కి మరీ చెప్తున్నడు. అలాంటప్పుడు మనమెంత జాగ్రత్తగా ఉండాలి .

నీ కోసం, నీ వాళ్ల కోసం, నీ దేశం కోసం ఒక పాతిక రోజులు బయటికి రాకుండా ఉండండి అంటే ఉండలేకపోతున్నారు . ఆదివారం వస్తే మటన్ షాపుల ముందు జనం గుమిగూడడం, ఇళ్లల్లోనే ఉండడంటే రోడ్ల మీదే పిల్లల ఆటలు , పెద్దల బాతకానిలు . సోషల్ డిస్టెన్సింగ్ పాటించండి అంటే ఆ మనకేమైతదిలే అని నిర్లక్ష్యం . వెరసి వీళ్ల బాద్యతారాహిత్యంతో మిగతావారందరిని కూడా ప్రమాదంలో పడేసేలా ఉన్నారు.

ఇప్పుడు కొంతమందిని కంట్రోల్ చేయకపోతే భవిష్యత్ లో కరోనా బారిన పడే లక్షలాదిమందిని కాపాడడం కష్టం, అందుకే పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. దాంతో పోలీసుల పట్ల వ్యతిరేకత వస్తుంది. ఇలా కాదని రాజస్థాన్ పోలీసులు ఒక నిర్ణయానికి వచ్చారు. జున్‌జున్‌ ప్రాంతంలో ‘ఏ పనీలేకుండా రోడ్లపైకి వచ్చేవారిని అరెస్టు చేయడం, లాఠీలతో కొట్టకూడదని డిసైడ్ అయ్యారు .మాకెందుకు ఆ బ్యాడ్ నేమ్ అని జేజేటీ వర్సిటీ, సింఘానియా వర్సిటీల్లో ఏర్పాటు చేసిన క్వారంటైన్‌ కేంద్రాల్లో రోగులకు సేవలు చేసేందుకు పంపిస్తున్నారు.

ఎలాగూ హాస్పిటల్స్, క్వారంటైన్ కేంద్రాల్లో సిబ్బంది కొరత ఉందని తెలిసిన విషమే . కాబట్టి లాక్ డౌన్ ఉల్లంఘిస్తే అక్కడకు పంపించి సేవ చేయిస్తున్నారు. రోడ్లపై చిల్లరగా తిరిగే వారిని గుర్తించి మాకు ఫొటోలు పంపితే, అధికారులు వారిని గుర్తించి క్వారంటైన్‌లలో సేవలకు పంపిస్తామని అధికారులు చెబుతున్నారు. దీంతో మన దగ్గర కూడా ఇదే అమలు చేస్తే బాగుంటుందని లాక్ డౌన్ ని స్ట్రిక్ట్ గా ఫాలో అయ్యేవారు అభిప్రాయపడ్తున్నారు.. తెలుగు రాష్ట్రాల పోలీసులు కొంచెం ఆలోచించండి..  ఇదేదో బాగున్నట్టుంది.


End of Article

You may also like