భార్య సంపాదన గురించి అడిగితే హైలైట్ కౌంటర్ ఇచ్చారుగా రాజీవ్..! ఏమన్నారంటే?

భార్య సంపాదన గురించి అడిగితే హైలైట్ కౌంటర్ ఇచ్చారుగా రాజీవ్..! ఏమన్నారంటే?

by Anudeep

Ads

యాంకరింగ్ రంగంలో మకుటం లేని మహరాణి సుమ. కేవలం టీవి ప్రోగ్రామ్స్ యాంకరింగే కాదు సినిమా ఈవెంట్స్ కూడా సుమ సారధ్యంలో జరగాల్సిందే. మరోవైపు ఈ మధ్య కొత్తగా యూట్యూబ్ ఛానెల్ కూడా స్టార్ట్ చేసింది. స్టార్ట్ చేసిన కొద్దిరోజుల్లోనే లక్షల్లో సబ్స్క్రైబర్స్. ఇంత ఫాలోయింగ్ ఉన్న సుమ  సంపాదన ఎంతో? అందరికి అదే డౌట్. ఇదే విషయం మీద ఇటీవల రాజీవ్ కనకాల ఆసక్తికర కామెంట్ చేశారు.

Video Advertisement

మీ రెమ్యునరేషన్ ఎంత అని ఎవరైనా అడిగితే సుమ చాలా తెలివిగా సమాధానం చెప్పకుండా తప్పించుకుంటుంది . సుమ నుండి ఎలాగు సమాధానం రాబట్టలేం అనుకుని  , రాజీవ్ కనకాలని ఇదే క్వశ్చన్ అడిగింది ఒక యూట్యూబ్ ఛానెల్.‘సుమ  ఎన్ని లక్షల రెమ్యునరేషన్ తీసుకుంటుందో నాకైతే తెలియదు. మీడియా వాళ్లు అంత ఇంత అని అంటుంటారు కాని, నాకైతే తెలియదు మీకు తెలిస్తే చెప్పండి అంటూ ప్రశ్నించారు.

ఇంట్లో లావాదేవీలు చూసే అలవాటు నాకు లేదు. నేను సుమ  సంపాదన గురించి అస్సలు పట్టించుకోను. నువ్ ఎంత సంపాదిస్తున్నావ్? ఏం చేస్తున్నావ్? నీ  అకౌంట్లో ఎంత మనీ  ఉంది అనే విషయం నేను పొరపాటున కూడా అడగను,తెలుసుకోవడానికి ప్రయత్నించను. ఆవిడ స్పేస్‌లోకి నేను వెళ్లి తన సంపాదన మీద  పెత్తనం చెలాయించే నేచర్ కాదు నాది అంటూ సీరియస్ అయ్యారు.

మన తరానికే కాదు మరో రెండు మూడు తరాల వరకు యాంకర్ అంటే టక్కున గుర్తొచ్చే పేరు సుమ. అంతగా పేరు సంపాదించింది. మళయాళి కుటుంబంలో పుట్టినప్పటికి సుమలా స్పష్టంగా తెలుగు మాట్లాడే యాంకర్ లేరంటే అతిశయోక్తి కాదు. ఇప్పుడు యాంకరింగ్ రంగంలో సుమ రాజసం వెనుక ,ఒకప్పడు పడిన కష్టం ఉంది. పెళ్లై,పిల్లలుపుట్టాక యాంకరింగ్ కి దూరం అయినా, సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసేప్పుడు ఒక చిన్న ఛానెల్ నుండే తన ప్రస్థానాన్ని ప్రారంభించింది.  రాజీవ్ కనకాల అన్నట్టు మనం కూడా తన స్పేస్ లోకి వెళ్లకపోవడమే బెటరేమో. ఏమంటారు?


End of Article

You may also like