“నా చెల్లెలు చనిపోయే రెండు రోజుల ముందు…ఆ బాధ తట్టుకోలేక”..కంటతడి పెట్టుకున్న రాజీవ్.!

“నా చెల్లెలు చనిపోయే రెండు రోజుల ముందు…ఆ బాధ తట్టుకోలేక”..కంటతడి పెట్టుకున్న రాజీవ్.!

by Mohana Priya

Ads

సుమ, రాజీవ్. పరిచయం అక్కర్లేని వ్యక్తులు. ఎంతో కాలం నుండి సీరియల్స్ ద్వారా, సినిమాల ద్వారా మనల్ని అలరిస్తున్నారు రాజీవ్ కనకాల. అలాగే సుమ కూడా ఎన్నో ప్రోగ్రామ్స్ ద్వారా మనల్ని ఎంటర్టైన్ చేస్తున్నారు. రాజీవ్ కనకాల తల్లి కొంతకాలం క్రితం స్వర్గస్తులయ్యారు. రాజీవ్ కనకాల తండ్రి ప్రముఖ నటులు దేవదాస్ కనకాల గారు కూడా ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. రాజీవ్ సోదరి శ్రీలక్ష్మి అనారోగ్య సమస్యల కారణంగా కొంతకాలం క్రితం చివరి శ్వాస విడిచారు.

Video Advertisement

రాజీవ్ కనకాల ఇటీవల ప్రముఖ యూట్యూబ్ ఛానల్ సుమన్ టీవీకి ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో తన కుటుంబంలో జరిగిన విషాదంపై రాజీవ్ కనకాల మాట్లాడుతూ “ఒకేసారి ముగ్గురు కుటుంబ సభ్యులని కోల్పోవడం చాలా బాధాకరంగా ఉంది. ఆ సమయంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాం. కానీ జీవితం అన్నాక ఇవన్నీ తప్పవు అని ధైర్యం తెచ్చుకున్నాం.

మేము ధైర్యం కోల్పోతే పిల్లల భవిష్యత్తు కష్టంగా ఉంటుందని భావించి ఆలోచనల్లో నుంచి బయటికి రావడానికి ప్రయత్నిస్తున్నాం. కానీ ఆలోచనలు వస్తూనే ఉంటాయి. నేను ఒక మూడు నెలలు పూర్తిగా డిప్రెషన్ లో ఉన్నాను. ముఖ్యంగా నా చెల్లెలు దూరమైనప్పుడు చాలా బాధగా అనిపించింది.

తనకి క్యాన్సర్ సోకిన తర్వాత మెల్లగా అనారోగ్యం నుండి కోలుకుంటోంది ఇప్పుడు సేఫ్ అనుకుంటున్నాం. నేను మధురైలో నారప్ప షూటింగ్ లో ఉన్నాను. లాక్ డౌన్ కి రెండు రోజుల ముందు నేను వచ్చాను. మా బావ ఫోన్ చేసి పాపాయికి బాలేదు అని చెప్పారు. నేను వెంటనే వెళ్లాను. నా చెల్లెలు బతికే ఛాన్సెస్ లేవు అన్నారు. ఆ సమయంలో తనకి జాండీస్ రావడంతో జాండీస్ తగ్గేంతవరకు కీమోథెరపీ కష్టం అన్నారు. తరువాత రెండు రోజుల్లో శ్రీలక్ష్మి లోకాన్ని వదిలి వెళ్ళిపోయింది.

మా మేనకోడళ్ళు ఇద్దరు ధైర్యవంతులు. చాలా బాగా అర్థం చేసుకుంటారు. వాళ్ళని మా ఇంటికి తీసుకువద్దామని అనుకున్నాం. కానీ వాళ్లకు వాళ్ల ఇంటితో ఉన్న అనుబంధం కారణంగా రాము అని చెప్పి వాళ్ళ నాన్న దగ్గర ఉన్నారు. మేము వాళ్లతో తరచుగా ఫోన్ లో మాట్లాడుతూ, అలాగే వాళ్ళ ఇంటికి వెళ్లి వస్తూ ఉంటాం. సుమతో వాళ్ళిద్దరూ చాలా క్లోజ్ గా ఉంటారు” అని అన్నారు.

watch video :

 


End of Article

You may also like