తెలుగు యాంకర్ గా సుమ కు ఎంతటి పేరు ప్రఖ్యాతలు ఉన్నాయో ప్రత్యేకం గా చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె వాక్చాతుర్యం, ప్రతిభ ఆమెను ఇంత స్టేజి పై నిలబెట్టాయి. హీరోయిన్లకు సమానం గా సంపాదించగలిగే ఆమె పై వచ్చే రూమర్లు అన్ని ఇన్ని కావు. వాటిని ఆమె చిరునవ్వుతోనే ఎదుర్కొంటారు. అయితే.. అన్నిటికంటే ఎక్కువ గా స్ప్రెడ్ అయిన రూమర్ ఆమె రాజీవ్ విడిపోతున్నారంటూ వార్తలు రావడమే.

rajeev kanakala

ఈ విషయమై ఆమె భర్త రాజీవ్ కనకాల క్లారిటీ ఇచ్చేసారు. 2018 వరకు రాజీవ్ కనకాల తన తల్లితండ్రులు, సుమ అందరు కలిసే ఉన్నారట. కానీ ఆ తరువాత రాజీవ్ తల్లిగారు మరణించాక.. తండ్రి గారు దేవదాస్ కనకాల ఒక్కరే మణికొండ లోని ఇంట్లో ఉండిపోయారట.

ఆయనను కూడా సుమ, రాజీవ్ ఉంటున్న ఫ్లాట్ కు తీసుకురావాలని అనుకున్నా.. ఆయన లైబ్రరీ ఎక్కువ గా ఉండడం.. అవి అన్ని షిఫ్ట్ చేయడానికి పాజిబుల్ కాకపోవడం తో రాజీవ్ కొంత కాలం పాటు తండ్రితోనే ఉన్నారట. అసలు విషయం తెలుసుకోకుండా వారిద్దరూ విడిపోయారు అంటూ వార్తలు వచ్చాయని.. వాటిల్లో నిజం లేదని రాజీవ్ కనకాల క్లారిటీ ఇచ్చారు.