“ఈ వార్తల వల్ల మా పిల్లలు ఇబ్బంది పడుతున్నారు..!” అంటూ… “రాజీవ్ కనకాల” కామెంట్స్..! ఏం జరిగిందంటే..?

“ఈ వార్తల వల్ల మా పిల్లలు ఇబ్బంది పడుతున్నారు..!” అంటూ… “రాజీవ్ కనకాల” కామెంట్స్..! ఏం జరిగిందంటే..?

by Mohana Priya

Ads

బుల్లితెర పైన రియాలిటీ షో అయినా, ఫిలిం ఆడియో ఫంక్షన్ లేక ప్రీ రిలీజ్ ఈవెంట్ అయినా…కార్యక్రమం ఏదైనా సరే దాన్ని హోస్ట్ చేయాలి అంటే యాంకర్ సుమ తర్వాతే అన్న విషయం అందరికీ తెలిసిందే. ప్రస్తుతం సుమాకి ఉన్న క్రేజ్ అటువంటిది.

Video Advertisement

చాలామంది తనను ఒక యాంకర్ గా కాకుండా తమ కుటుంబంలో ఒక సభ్యురాలుగా భావిస్తుంటారు. మరి ముఖ్యంగా సినిమాలకు సంబంధించి ఏ ఫంక్షన్ జరిగినా అందులో సుమ యాంకరింగ్ లేకపోతే కాస్త వెలితిగానే అనిపిస్తుంది.

అయితే గత కొద్దికాలంగా సుమకు ఆమె భర్త రాజీవ్ కనకాల కు మధ్య పరస్పర విభేదాలు తలెత్తాయని…ఈ కారణంగా వారి త్వరలో విడాకులు తీసుకోబోతున్నారు అని సోషల్ మీడియాలో బాగా గాసిప్స్ స్ప్రెడ్ అవుతున్నాయి. కొంతమంది అయితే వారు సరిపడక విడివిడిగా ఉంటున్నారు అని కూడా పోస్టులు పెట్టారు. అటువంటిది ఏమీ లేదు అని సుమ ఈ విషయంపై పలు సార్లు క్లారిటీ ఇచ్చినప్పటికీ రూమర్స్ మాత్రం తగ్గడం లేదు.

తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు రాజీవ్ కనకాల ఈ కామెంట్స్ పై తనదైన శైలిలో స్పందించారు. మా మీద వస్తున్న విడాకుల వార్తలు నాకు సుమకు కొత్త కాదు.. మేము విడిపోతున్నాం అన్న ప్రచారం ఎప్పటినుంచో జరుగుతుంది.. చాలాసార్లు వీటి పై స్పందించి ,నిజం కాదు అని క్లారిటీ ఇచ్చినా ఎందుకో ప్రచారం మాత్రం ఆగడం లేదు. సుమ హోస్ట్ చేస్తున్న షోలకు నేను వెళ్తున్నాను.. కలిసి టూర్స్ కి వెళ్తున్నాం.. రీసెంట్‌గా అమెరికా వెళ్ళాము అక్కడ రీల్స్ కూడా చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాము.

మేము కలిసి ఉన్నామని చెప్పడానికి ఇంతకుమించి ఏం చేయాలో మాకు అర్థం కావడం లేదు. రూమర్స్ పై స్పందించి.. స్పందించి ….ఇప్పటికే మాకు చిరాకు వస్తుంది.. మాకైతే ఇటువంటి వార్తలు వల్ల ఎటువంటి ఇబ్బంది లేదు కానీ మా పిల్లలు ఈ వార్తలు వల్ల ఇబ్బంది పడుతున్నారు. ఇటు స్కూల్‌లో.. అటు కాలేజీలో ‘మీ అమ్మానాన్నలు విడిపోతున్నారంట కదా’అని వాళ్ళ ఫ్రెండ్స్ అడిగినప్పుడు పిల్లల మనసుకు కష్టంగా ఉంటుంది. కనీసం వాళ్ళని దృష్టిలో పెట్టుకొని అయినా ఇటువంటి రూమర్స్ స్ప్రెడ్ చేయకుండా ఉంటే బాగుంటుంది అని రాజీవ్ చెప్పారు.

ALSO READ : ఇక్కడ హిట్… కానీ అక్కడ ఆడలేదా..? కారణం ఏంటంటే..?


End of Article

You may also like