“బిజీగా ఉండడమే కారణం ఏమో..!” అంటూ… “ఎన్టీఆర్- చంద్రబాబు” విషయంపై రాజీవ్ కనకాల కామెంట్స్..! ఏం అన్నారంటే..?

“బిజీగా ఉండడమే కారణం ఏమో..!” అంటూ… “ఎన్టీఆర్- చంద్రబాబు” విషయంపై రాజీవ్ కనకాల కామెంట్స్..! ఏం అన్నారంటే..?

by kavitha

Ads

టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్ట్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో అరెస్టయిన చంద్రబాబు రాజమండ్రి జైలులో ఉన్నారు. నెలరోజులు దాటినా కూడా చంద్రబాబుకు బెయిల్‌ దొరకకపోవడంతో టీడీపీ నేతలు పోరు బాట పట్టారు.

Video Advertisement

చంద్రబాబు అరెస్ట్‌ పై నందమూరి ఫ్యామిలీకి చెందిన వారంతా స్పందించినా జూనియర్ ఎన్టీఆర్‌ మాత్రం ఇప్పటివరకు స్పందించలేదు. ఈ విషయం పైన ఎన్టీఆర్‌ రెస్పాండ్ కాకపోవడానికి బహుశా ఇదే కారణం ఏమో అని  యాక్టర్ రాజీవ్‌ కనకాల అన్నారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును అరెస్ట్ చేసిన రోజు నుండి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా నిరసనలు జరుగుతున్న సంగతి తెలిసిందే. చంద్రబాబు అరెస్ట్‌ను ఐటీ ఉద్యోగులు దగ్గర నుండి ఇతర రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు కూడా ఖండిస్తూ వచ్చారు. నందమూరి కుటుంభ సభ్యులు కూడా స్పందించారు. అయితే ఈ విషయం పై ఆ కుటుంబంలోని జూనియర్‌ ఎన్టీఆర్‌ నుంచి ఎటువంటి స్పందన రాకవపోవడం అనేది  అందరినీ ఆశ్చర్యపరిచింది.
ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ తరుపున ప్రచారం చేసిన తారక్, కొంతకాలం నుండి పార్టీకి దూరంగా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలోనే చంద్రబాబు అరెస్ట్‌పై ఎలాంటి ప్రకటన చేయలేదని అంటున్నారు. జూనియర్‌ ఎన్టీఆర్‌ మౌనంగా ఉండడం పై  పార్టీ నాయకుల నుండి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొందరు ఎన్టీఆర్ కి మద్ధతుగా మాట్లాడుతున్నారు. తాజాగా ఈ  విషయం పై జూనియర్‌ ఎన్టీఆర్‌ ఫ్రెండ్ రాజీవ్‌ కనకాల స్పందించారు. చంద్రబాబు అరెస్ట్ పై ఎన్టీఆర్‌ సైలెంట్ గా ఉండడం గురించి అడుగగా, రాజీవ్‌ కనకాల మాట్లాడుతూ, “ఎన్టీఆర్‌ స్పందించకపోవడానికి రీజన్  సినిమాలతో బిజీగా ఉండడమే కారణం” అని తాను అనుకుంటున్నట్లుగా తెలిపారు. “ఆర్ఆర్ఆర్ మూవీ, ఆ తరువాత కరోనా, ఈ విరామంలో ఎన్టీఆర్‌ కనీసం 4 చిత్రాలు అయినా చేసేవారు. ప్రస్తుతం ఎన్టీఆర్‌ దేవర మూవీలో నటిస్తున్నారు. చాలా ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ మూవీ మీద దృష్టి పెట్టారని, పూర్తి సమయాన్ని దేవర కోసం  కేటాయిస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఎన్టీఆర్‌ దృష్టి మొత్తం చిత్రాలపైనే పెట్టాలని అనుకుని ఉండొచ్చని తాను  భావిస్తున్నట్టు” గా రాజీవ్‌ కనకాల తెలిపారు.

watch video:

Also Read: చంద్రబాబు క్వాష్ పిటిషన్‌ పై సుప్రీంకోర్టులో వినిపించిన వాదనలు ఏమిటంటే..?


End of Article

You may also like