Ads
సూపర్ స్టార్ రజినీకాంత్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దక్షిణాది నుండి ఉత్తరాది ఇండస్ట్రీ వరకు అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగిన అగ్ర హీరోలలో రజినీకాంత్ ఒకరు. ఇక రజినీ స్టైల్, యాటిట్యూడ్,యాక్టింగ్ కు ప్రత్యేకంగా ఫ్యాన్స్ ఉంటారు.
Video Advertisement
70 ఏళ్ల వయసులోనూ రజినీకాంత్ క్రేజ్ కొంచెం కూడా తగ్గడం లేదు. ఇప్పటికీ ఆయన బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో ఆడియెన్స్ ను అలరించేందుకు రెడీ అవుతున్నారు. రజినీకాంత్ నటించిన జైలర్ మూవీ ఆగస్ట్ 10న రిలీజ్ కానుంది. అయితే ఈ మూవీ కోసం రజినీకాంత్ అందుకున్న రెమ్యూనరేషన్ తాజాగా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
రజినీకాంత్ ప్రధాన పాత్రలో నటిస్తున్న జైలర్ మూవీని నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్, మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్, రమ్యకృష్ణ, తమన్నా, టాలీవుడ్ యాక్టర్ సునీల్ కీలక పాత్రలలో నటిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ టీజర్, పాటలు, ట్రైలర్ తో ఈ చిత్రం పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
కళానిధి మారన్ సన్ పిక్చర్స్ బ్యానర్ పై ఈ సినిమాని నిర్మించారు. ఈ చిత్రం ఆగస్ట్ 10న తెలుగు, తమిళ బాషలలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ జైలర్ సినిమా ప్రమోషన్స్ వేగం పెంచారు. మూవీ యూనిట్ కొద్ది రోజులుగా వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తూ బిజీగా ఉన్నారు.
తాజాగా ఈ చిత్రానికి సూపర్ స్టార్ రజినీకాంత్ తీసుకున్న పారితోషికం గురించి సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దాంతో ఈ విషయం సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. జైలర్ సినిమా కోసం రజినికాంత్ రూ.110 కోట్ల భారీ రెమ్యూనరేషన్ తీసుకున్నారని టాక్. ఈ విషయం విన్న స్టార్ హీరోలు సైతం షాక్ అవుతున్నారట. సీనియర్ అగ్ర హీరోలలో ఈ రేంజ్ లో పారితోషికం తీసుకుంటూ రజినికాంత్ రికార్డ్స్ సృష్టిస్తున్నారు.
Also Read: “బిజినెస్‌మేన్” మూవీలో “కాజల్ ఫ్రెండ్” గా నటించిన నటి ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..?
End of Article