Ads
సూపర్ స్టార్ రజినీకాంత్ ముఖ్య పాత్రలో నటించిన లేటెస్ట్ సినిమా ‘లాల్ సలాం’. ఈ మూవీలో విష్ణు విశాల్, విక్రాంత్ హీరోలుగా నటించగా, రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య రజనీకాంత్ దర్శకత్వం వహించారు. నేడు రిలీజ్ అయిన ఈ మూవీ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..
Video Advertisement
- చిత్రం : లాల్ సలాం
- నటీనటులు : రజినీకాంత్, విష్ణు విశాల్, విక్రాంత్, జీవిత రాజశేఖర్ తదితరులు..
- నిర్మాత : ఏ సుభాస్కరన్,
- దర్శకత్వం : ఐశ్వర్య రజనీకాంత్
- సంగీతం : AR రెహమాన్
- విడుదల తేదీ : ఫిబ్రవరి 9, 2024
స్టోరీ :
లాల్ సలామ్ స్టోరీ విష్ణు(విష్ణు విశాల్) పాత్ర చుట్టూ తిరుగుతుంది. నిర్లక్ష్యంగా ఉండే విష్ణు క్రికెట్ ను కెరీర్ గా ఎంచుకుంటాడు. అయితే అతని మార్గంలో ఎన్నో అడ్డంకులు ఎదురవుతాయి.ఆ ఊర్లో రెండు రోజులు జరిగే జాతరలో గొడవ జరుగుతుంది. దానిని ఆపమని ఎవరు చెప్పిన వారు వినరు. కానీ లాల్ సలామ్ చెప్పగానే ఆపుతారు.గుడికి చెందిన జాతరను ఒక ముస్లిం అయిన లాల్ సలామ్ చెప్పగానే ఎందుకు ఆపారు. అసలు లాల్ సలామ్ ఎవరు? విష్ణు అనుకున్నది సాధించడా అనేది మిగిలిన కథ.
రివ్యూ :
ఐశ్వర్య రజనీకాంత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం భిన్న మతాలకు చెందిన మనుషుల మధ్య ఐక్యత ఎంత ముఖ్యమనేది హైలైట్. డైరెక్టర్ ఎంచుకున్న స్టోరీ లైన్ బాగున్నపతికి దాన్ని ఇంప్లిమెంట్ చేయడంలో తడబడ్డారు. పండుగలు,మతం, రాజకీయాలు, క్రికెట్ గ్రామంలోని తగాదాలు వంటి అంశాలను చూపించారు.
ప్రధమార్ధం యావరేజ్ గా ఉండగా, సెకండ్ హాఫ్ పర్వాలేదు. రజినీకాంత్ చెప్పే డైలాగ్స్ ఎప్పటిలానే హైలెట్ గా నిలిచాయి. నటీనటుల విషయానికి వస్తే రజినికాంత్ లాల్ సలామ్ గా అద్భుతంగా నటించారు. విష్ణు విశాల్, విక్రాంత్ తమ పాత్రలో చక్కగా నటించారు. మిగతావారు తమ పాత్రల మేరకు నటించారు.
ప్లస్ పాయింట్స్ :
- రజనీకాంత్,
- స్టోరీ లైన్,
- డైలాగ్స్,
మైనస్ పాయింట్స్:
- స్క్రీన్ ప్లే,రేటింగ్:2.5/5
ట్యాగ్ లైన్ :
స్టోరీ లైన్ బాగున్నప్పటికి, బలహీనపమైన కథనంతో సాగుతుంది. సూపర్ స్టార్ రజినికాంత్ కోసం ఈ మూవీ చూడవచ్చు.
watch trailer :
End of Article