“రాకేష్ మాస్టర్” ఇప్పటివరకు సంపాదించిన ఆస్తుల విలువ ఎంతో తెలిస్తే… షాక్ అవ్వాల్సిందే..!

“రాకేష్ మాస్టర్” ఇప్పటివరకు సంపాదించిన ఆస్తుల విలువ ఎంతో తెలిస్తే… షాక్ అవ్వాల్సిందే..!

by kavitha

Ads

ప్రముఖ సీనియర్ కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్ హఠాత్తుగా మరణించడం ఇండస్ట్రీ వర్గాలను దిగ్భ్రాంతికి గురి చేసింది. రాకేష్ మాస్టర్ 1500 చిత్రాలకు కొరియోగ్రఫర్ గా పని చేశారు. చాలా మంది అగ్ర హీరోలకు అద్భుతమైన కొరియోగ్రఫీ అందించారు.

Video Advertisement

ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న స్టార్ కొరియోగ్రాఫర్లు శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్ లాంటివాళ్ళు రాకేష్ మాస్టర్ వద్ద శిష్యరికం చేశారు. అటువంటి రాకేష్ మాస్టర్ కొంతకాలంగా సాధారణ జీవితాన్ని గడపడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ క్రమంలో రాకేష్ మాస్టర్ ఆస్తుల పై చర్చలు జరుగుతున్నాయి. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..rakesh-masterరాకేష్ మాస్టర్ కొద్దికాలంగా ఎవరు లేని వాడిలా అనాధశ్రమంలో జీవితాన్ని గడుపుతూ వచ్చారు. ఇక యూట్యూబ్ ఛానల్స్ లో కాంట్రవర్సీ కామెంట్లు చేస్తూ ఇంటర్వ్యూలు ఇవ్వడం ద్వారా వార్తల్లో నిలిచారు. ఒకప్పుడు స్టార్ కొరియోగ్రాఫర్ ఎందుకిలా అయ్యాడని అనుకున్నారు. 1500 సినిమాలకు కొరియోగ్రఫీ చేసి, చాలా సంవత్సరాలు పరిశ్రమలో ఉన్న రాకేష్ మాస్టర్ ఏమి సంపాదించుకోలేదా, అందువల్లే ఆఖరి దశలో అనాధశ్రమంలో జీవించారా అనే సందేహాలు చాలా మందికి వస్తున్నాయి.
ఈ క్రమంలోనే రాకేష్ మాస్టర్ ఆస్తుల పై చర్చ జరుగుతోంది. రాకేష్ మాస్టర్ ప్రేమించిన అమ్మాయినే పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు. కుమార్తె, కుమారుడు ఉన్నారు. ఆ తరువాత విడిపోయారు. ఆ తరువాత రెండవ పెళ్లి చేసుకున్నారు. అది ఎక్కువకాలం సాగలేదు. ఆ తర్వాత రాకేష్ మాస్టర్ ఒక మహిళతో సహజీవనం చేసిన విషయం అందరికి  తెలిసిందే.
ఆయన చనిపోవడానికి కొన్ని నెలల ముందు ఆ మహిళతో విభేదాలు రావడంతో ఆమెకు కూడా దూరమయ్యారు. ఇక ఆస్తుల విషయానికి వస్తే రాకేష్ మాస్టర్ కొరియోగ్రాఫర్ గా ఉన్నప్పుడు ఆస్తులు బాగానే సంపాదించారని సమాచారం. ఆయనకు జూబ్లీహిల్స్ లో పెద్ద బంగ్లాతో పాటు, హైదరాబాద్ శివార్లలో 3 ఎకరాల ల్యాండ్  ఉన్నట్లు తెలుస్తోంది. ఆ భూమి విలువ కోట్లలో ఉంటుందని తెలుస్తోంది. రాకేష్ మాస్టర్ ఆస్తుల విలువ దాదాపు 50 కోట్లపైనే ఉంటుందని అంటున్నారు.

Also Read: “తుపాకీ” సినిమా గొడవతో పాటు… తమిళ్ హీరో “విజయ్” ఇరుక్కున్న 12 కాంట్రవర్సీలు ఇవే..!

 


End of Article

You may also like