“తుపాకీ” సినిమా గొడవతో పాటు… తమిళ్ హీరో “విజయ్” ఇరుక్కున్న 12 కాంట్రవర్సీలు ఇవే..!

“తుపాకీ” సినిమా గొడవతో పాటు… తమిళ్ హీరో “విజయ్” ఇరుక్కున్న 12 కాంట్రవర్సీలు ఇవే..!

by kavitha

Ads

సౌత్ ఇండస్ట్రీలో అగ్ర హీరోలలో దళపతి విజయ్ ఒకరు. ఆయన క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. విజయ్ తుపాకీ మూవీ నుంచి వరుసగా విజయాలు అందుకుంటూ వస్తున్నాడు. విజయ్ చిత్రాలు ఈజీగా 100 కోట్ల కలెక్షన్స్ రాబడుతున్నాయి. అయితే  విజయ్ కి ఎంత పాపులారిటీ ఉందో దానితో పాటు వివాదాలు ఉన్నాయి.

Video Advertisement

తన సినిమాల్లోని  డైలాగ్స్‌, ఇతర విషయలలో పలు మార్లు వివాదాలలో ఇరుక్కున్నారు. అయితే వివాదాలలో కూడా ప్రశాంతంగా వాటిని పరిష్కరించుకుంటూ వెళ్ళడం ఆయన ప్రత్యేకత. అందుకే అభిమానులు విజయ్ ని మరింత ఇష్టపడుతున్నారు. బాక్సాఫీస్ దగ్గర ప్లాప్ అయినా, వివాదాలైనా సరే, అభిమానులు ఎప్పుడూ తమ స్టార్‌కి అండగా ఉన్నారు. అంతటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న దళపతి విజయ్ ఇరుకున్న వివాదాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం.. thalapathy-vijay1. తుపాకి మూవీ వివాదం:

2012 లో రిలీజ్ అయిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్‌ అయ్యింది. విజయ్ స్మోకింగ్‌ చేస్తున్న ఫస్ట్ లుక్ పోస్టర్‌ రిలీజ్ కాగానే పై రాజకీయ నేతలు విమర్శలు చేశారు. అలాగే సినిమా విడుదలకు కాకముందే సినిమాలో విలన్ పాత్రని చూపించిన విధానంపై కొన్ని సంఘాలు ఈ సినిమా కథ పై అభ్యంతరం వ్యక్తం చేశాయి. అయితే విజయ్ వాటిని  ప్రశాంతంగా సాల్వ్ చేశాడు. రిలీజ్ అయిన తరువాత ‘తుపాకి ‘ బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. 2. తలైవా వివాదం: 

2013 లో రిలీజ్ అయిన తలైవా సినిమా వివాదాల వల్ల ఆర్థికంగా నష్టపోయింది. ఈ మూవీలో విజయ్, అమలా పాల్ నటించగా ఏఎల్ విజయ్ దర్శకత్వం వహించారు. గ్యాంగ్‌స్టర్ డ్రామాతో తెరకెక్కిన తలైవా కథ రాజకీయంగా రెచ్చగొట్టేలా ఉందని పలువురు విమర్శలు వచ్చాయి. తలైవా అని టైటిల్ పెట్టడం కూడా చర్చనీయాంశంగా మారింది. ఆ టైంలో తమిళనాడు ప్రభుత్వాన్ని పాలిస్తున్న అధికార పార్టీ విజయ్‌ పై ఎన్నో రకాలుగా ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నించింది.రాష్ట్రంలో సినిమాను రిలీజ్ చేయకుండా బ్యాన్ చేసింది. అయితే విజయ్ ప్రభుత్వంతో మాట్లాడి సమస్యలను పరిష్కరించిన తర్వాత మూవీ రిలీజ్ తమిళనాడు లో తప్ప అన్ని చోట్ల రిలీజ్ అయిన వారానికి తమిళనాడులో విడుదలైంది. దీంతో సినిమాకి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. దీని వల్ల మేకర్స్ ఆర్థికంగా నష్టపోయారు.

3. కత్తి వివాదం

హీరో విజయ్, మురుగదాస్ కాంబినేషన్ లో వచ్చిన కత్తి సినిమా చాలా పెద్ద హిట్ అయ్యింది. ఈ సినిమాని తెలుగులో డబ్ చేసి కూడా విడుదల చేయకుండా ఆపేశారు. అయితే ఈ సినిమా తమిళ్ లో విడుదలకి ముందు కూడా చాలా గొడవలు జరిగాయి. ప్రముఖ డైరెక్టర్ గోపి నైనార్ కత్తి సినిమా కథ తనదే అని, ఏఆర్ మురుగదాస్ తో ఈ కథ చర్చిస్తున్నప్పుడు ఆ కథనే తీసుకొని తాను సినిమాగా తీశారు అని, మురుగదాస్ తనని మోసం చేశారు అని చెప్పారు. కానీ ఆ తర్వాత మురుగదాస్ ఈ విషయంపై మాట్లాడి మొత్తం పరిష్కరించారు.

controversies faced by thalapathy vijay

4. పులి వివాదం:

2015 లో పులి అనే సోషియో ఫాంటసీ సినిమా రిలీజ్ అయ్యింది. ఈ సినిమా విడుదలకు ఒకరోజు ముందు ఇన్ కమ్ టాక్స్ ఆఫీసర్లు విజయ్ మరియు నిర్మాతల ఆస్తుల పై దాడులు చేసి రిలీజ్ రోజు వరకు విచారణ కొనసాగించారు. ఫస్ట్ డే మార్నింగ్ షోలను థియేటర్ యాజమాన్యాలు రద్దు చేసేలా చేసి, విచారణ పూర్తి అయ్యాకే సినిమాను రిలీజ్ చేసేందుకు అనుమతించారు. విజయ్ విచారణలో క్లారిటీ వచ్చిన తరువాత మధ్యాహ్నం నుండి విడుదలైంది.
5. మెర్సల్ వివాదం:

2017లో ఈ చిత్రం రిలీజ్ అయ్యింది. ఈ మూవీకి అట్లీ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో దేశంలో జరుగుతున్న మెడికల్ స్కామ్ గురించి చెప్పడంతో ఈ సినిమా పై వివాదాలు తలెత్తాయి. ముఖ్యంగా ఉచిత వైద్యం ఎందుకు అందించడం లేదని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ విజయ్ డైలాగ్‌ను అధికార కేంద్ర పార్టీ తీవ్రంగా వ్యతిరేకించింది. పార్టీ మద్దతుదారులు కూడా విజయ్ ప్రభుత్వం పై ప్రతికూల ప్రచారం చేశారని ఆరోపించారు మరియు నటుడు మరియు చిత్రానికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు.
6. సర్కార్ వివాదం: 2018

2018లో రిలీజ్ అయిన సర్కార్ సినిమా పై కూడా వివాదాలు తలెత్తాయి స్మోకింగ్ చేస్తున్న విజయ్‌ ‘సర్కార్’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలైంది. దీంతో రాజకీయంగా పెద్ద దుమారమే రేగింది. ఈ ఫోటోతో  రాజకీయ నాయకులు విజయ్‌ విమర్శించారు. దాంతో విజయ్‌ దానిని తన సోషల్ మీడియా హ్యాండిల్ నుండి తొలగించాడు. అంతే కాకుండా సినిమాలో కొన్ని డైలాగులపై ప్రభుత్వ అధికారులు సినిమా రిలీజ్ ను అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయితే విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రితో మాట్లాడి సమస్యలను పరిష్కరించి, రిలీజ్ అయ్యేలా చేశారు.
7. బిగిల్ సినిమా వివాదం:

2019 లో వచ్చిన బిగిల్ కూడా వివాదాస్పద చిత్రాలలో ఒకటిగా నిలిచింది. ఒక వ్యక్తి తన కథను కాపీ చేశారని ఆరోపిస్తూ సౌత్ ఇండియన్ ఫిల్మ్ రైటర్స్ అసోసియేషన్‌లో ఫిర్యాదు చేసాడు. బిగిల్ చిత్రీకరణను అపాలని కోర్టుకు వెళ్ళాడు. ఆ తరువాత ఈ కేసును చెన్నై సిటీ సివిల్ కోర్టు కొట్టి వేసింది.
8. ఆదాయపు పన్ను దాడులు: 

ఫిబ్రవరి 5, 2020న, షూటింగ్ లో ఉన్న విజయ్ మాస్టర్ సెట్స్‌ పైన ఇన్ కమ్ టాక్స్ ఆఫీసర్లు రైడ్ చేశారు. AGS సినిమాస్‌  పన్ను ఎగవేత కేసుకు సంబంధించి తదుపరి దర్యాప్తు కోసం విజయ్ ని కూడా విచారించారు. మదురైలోని ఏజీఎస్ సినిమాస్, ఫిల్మ్ ఫైనాన్షియర్ అన్బు చెలియన్ ఆస్తులపై దాడులు జరిగాయి. అలాగే చెన్నైలోని విజయ్ నివాసం పై కూడా ఇన్ కమ్ టాక్స్ శాఖ దాడులు చేసింది.9. తల్లిదండ్రులపై కేసు:

2021 లో రాజకీయాలలో తన పేరును లేదా తన అభిమాన సంఘాల పేరును ఉపయోగించకుండా నిషేధం విధించాలని కోరుతూ దళపతి విజయ్ తన తల్లిదండ్రులతో పాటుగా మరికొందరి పై కేసు పెట్టారు. ఈ కేసును కోర్టు విచారించి, విజయ్ తండ్రి తన కొడుకు పేరు మీద స్థాపించిన రాజకీయ పార్టీ విజయ్ మక్కల్ ఇయక్కమ్‌ను రద్దు చేసింది. 10. రోల్స్ రాయిస్ కారుకు పన్ను మినహాయింపు:

దళపతి విజయ్ కొనుగోలు చేసిన రోల్స్ రాయిస్ కారు పై ఎంట్రీ ట్యాక్స్‌ చెల్లించనందుకు గత ఏడాది తలపతి విజయ్‌కి మద్రాస్ హైకోర్టు లక్ష రూపాయల జరిమానా విధించింది. విజయ్ సెప్టెంబర్ 2021లో రూ. 7,98,075 ఎంట్రీ ట్యాక్స్‌ని చెల్లించాడు. కానీ డిసెంబర్ 2005 -సెప్టెంబరు 2021 మధ్య పన్ను చెల్లించనందుకు కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ రూ. 30,23,609 జరిమానా విధించాలని డిమాండ్ చేసింది. అయితే, విజయ్ దానిని తగ్గించాలని మరో పిటిషన్‌ను దాఖలు చేశారు. గడువుకు ముందే పూర్తి ట్యాక్స్‌ చెల్లించడంతో చెన్నై హైకోర్టు ఆ కేసును కొట్టి వేసింది.
11. ట్రాఫిక్ ఉల్లంఘన నియమాలు

టింటెడ్ గ్లాస్ వాడకాన్నిసుప్రీంకోర్టు నిషేధించిన తరువాత దళపతి విజయ్ కారుకు నల్లటి అద్దాలు ఉండడంతో రూ. 500 జరిమానా విధించారు. అలాగే టింటెడ్ గ్లాస్‌ను తొలగించాలని పోలీసులు సూచించినట్లు సమాచారం.12. విడాకుల పుకార్లు:

దళపతి విజయ్ తన భార్య సంగీతకు విడాకులు ఇస్తున్నట్లు రూమర్స్ వచ్చాయి. దానికి కారణం విజయ్  మరియు అతని భార్య సంగీత పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకుంటున్నట్లు విజయ్ వికీపీడియా పేజీలో రావడంతో ఈ రూమర్స్ మొదలయ్యాయి.అయితే వారి సన్నిహిత వర్గాలు రూమర్స్ మాత్రమే అని తెలిపాయి. అప్పటితో ఈ వార్తలు ఆగిపోయాయి.

Also Read: ప్రభాస్ “ఆదిపురుష్” సినిమాని ట్రోల్ చేస్తున్న వారికి… చిలుకూరు ప్రధాన అర్చకులు స్ట్రాంగ్ కౌంటర్..! ఏం అన్నారంటే..?


End of Article

You may also like