Ads
టాలీవుడ్ కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్ కన్నుమూసిన విషయం తెలిసిందే. మాస్టర్ అనారోగ్యంతో గాంధీ ఆస్పత్రిలో చేరిన ఆయన చికిత్స పొందుతూ మరణించారు. ఒకప్పుడు టాలీవుడ్ లో 1500 చిత్రాలకు కొరియోగ్రాఫర్ చేసిన రాకేష్ మాస్టర్ ఆఖరి దశలో చాలా ఇబ్బందులు పడ్డారు.
Video Advertisement
సినీ ఇండస్ట్రీకి దూరమైన ఆయన కొంతకాలంగా యూట్యూబ్ ఛానెళ్లకు ఇంటర్వ్యూలు ఇస్తూ, వాటిలో సెలెబ్రెటీల పై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలిచారు. రాకేష్ మాస్టర్ హఠాన్మరణంతో ఆయన ఫ్యామిలీ తీవ్ర విషాదంలో ఉంది. అయితే తాజాగా రాకేష్ మాస్టర్ కుమారుడు చరణ్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
రాకేష్ మాస్టర్ చిన్నప్పటి నుండి చాలా కష్టాలు పడి, కొరియోగ్రాఫర్ ఉన్నత స్థాయికి చేరుకున్నారు. కానీ అంతే వేగంగా ఆయన కిందికి పడిపోయారు. ప్రభాస్, మహేష్ బాబు వంటి స్టార్ హీరోల సినిమాలకు కొరియోగ్రాఫర్ పని చేశారు. చివరి రోజుల్లో యూట్యూబ్ ఛానల్స్ కు ఇంటర్వ్యూలలో ఆయన చేసిన కామెంట్స్ తో రాకేష్ మాస్టర్ తన జీవితాన్ని అట్టడుగు స్థాయికి పడిపోయేలా చేసుకున్నారు.రాకేష్ మాస్టర్ బతికి ఉన్నన్ని రోజులు యూట్యూబ్ చానెళ్లు తమ లాభం కోసం తన తండ్రిని చెడుగా చూపించారని, మాస్టర్ తనయుడు చరణ్ ఛానెళ్లను తప్పు పడుతూ, యూట్యూబ్ చానెళ్ల పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. తన తండ్రి చనిపోవడానికి కారణం యూట్యూబ్ చానెళ్ళే అని అన్నారు. తన తండ్రికి ఇలా జరగడానికి ప్రధాన కారణం సోషల్ మీడియా. అనేక యూట్యూబ్ ఛానెల్స్ తన తండ్రిని స్వలాభం కోసం వాడుకున్నాయని, తన తండ్రిని చెడుగా చిత్రీకరించారని అన్నాడు. ఆ వీడియోలను వెంటనే ఆపమని, ఇకపై ఆ వీడియోలను వేయడం మానేయమని అన్నారు. సోషల్ మీడియాలో మా ఫ్యామిలీ మెంబర్స్ ను గురించి మాట్లాడుతూ వేధించవద్దని అన్నారు. మా ఫ్యామిలికి చేసిన నష్టం చాలని చరణ్ ఆవేదనతో అన్నారు. ఎవరైనా మళ్లీ మా జీవితాల్లోకి వస్తే పోలీస్ కంప్లైంట్ ఇవ్వాల్సి ఉంటుందని హెచ్చరించారు.
Also Read: 14 మంది కలిసి ఒక్కడి మీద పగ బట్టారు.. రాకేష్ మాస్టర్ కష్టాలు తెలిస్తే కన్నీళ్లు ఆగవు..!
End of Article