Ads
ప్రముఖ నటి రకుల్ ప్రీత్ సింగ్, నిర్మాత జాకీ భగ్నానీ విదేశాలలో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోబోతున్నారని అందరికీ తెలిసిందే. అయితే తాజాగా ఈ లవ్ బర్డ్స్ పెళ్లి వేదికని మార్చేశారు. గోవాలోని ఒక లగ్జరీ హోటల్లో పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయ్యారు. సౌత్ గోవాలోని ఐటిసి గ్రాండ్ హోటల్ లో రకుల్, జాకీల వివాహం జరగనుంది. కేవలం కుటుంబ సభ్యులు కొందరు అతిథులు మాత్రమే వివాహానికి హాజరవుతారని సమాచారం. ఇక ఈ దంపతులు బుక్ చేసిన ఐటీసీ గ్రాండ్ రిసార్ట్ ఒక విలాసవంతమైన హోటల్.
Video Advertisement
45 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ హోటల్లో మొత్తం 246 గదులు ఉంటాయి. ఒక్కొక్క గదికి 19,000 నుంచి 75 వేల రూపాయల వరకు ఒక రాత్రికి వసూలు చేస్తారు. ఇది కాకుండా ఇంకా అదనపు పన్నులు కూడా యాడ్ అవుతాయి. ఈ హోటల్లో మూడు రోజులపాటు పెళ్లి వేడుక జరగబోతుంది. ఫిబ్రవరి 19 నుంచి ప్రీ వెడ్డింగ్ కార్యక్రమాలు ప్రారంభం కాబోతున్నాయి.
అలాగే రకుల్ జాకీలు ఆదర్శంగా నిలిచిన మరొక విషయం ఏమిటంటే వారు ఈ వెడ్డింగ్ ని ఎకో ఫ్రెండ్లీగా చేసుకోబోతున్నారు ఈ వివాహంలో పటాకులు ఉండవని ఈవెంట్ మేనేజర్ స్పష్టం చేశారు. అంతా డిజిటల్ ఆహ్వానమే. రకుల్ ప్రీత్ సింగ్ జాకీ భగ్నాని చాలా సంవత్సరాలుగా ప్రేమలో ఉన్నారు. లాక్ డౌన్ సమయంలోనే వీరు ప్రేమలో ఉన్నట్లు తెలుస్తుంది.
రకుల్ తెలుగు, తమిళ, కన్నడ భాషలతో పాటు బాలీవుడ్ లో కూడా నటించి మంచి పేరు సంపాదించింది. ఇక ఆమె కాబోయే భర్త జాకీ భగ్నానీ కూడా హిందీ పరిశ్రమలో ప్రముఖ నిర్మాతగా కొనసాగుతున్నారు. మరి కొన్ని రోజుల్లో ఒక ఇంటి వారు కాబోతున్న మీ ఇద్దరికీ వారి అభిమానులు, నెటిజన్ లు సినీ ప్రముఖులు అడ్వాన్స్ విషెస్ చెప్తూ మెసేజ్లు పెడుతున్నారు.
End of Article