బాలయ్యబాబుకే షాకిచ్చిన రకుల్… ఆ సినిమానే కారణమా.?

బాలయ్యబాబుకే షాకిచ్చిన రకుల్… ఆ సినిమానే కారణమా.?

by Anudeep

Ads

“గౌతమీ పుత్ర శాత కర్ణి” సినిమా తరువాత బాలయ్యబాబు కు మంచి విజయం లభించలేదు. ప్రస్తుతం.. ఆయన నటిస్తున్న “అఖండ” సినిమా పై అభిమానులు గట్టి గానే ఆశలు పెట్టుకున్నారు. బోయపాటి, బాలయ్యబాబు కాంబోలో రాబోతున్న మూడవ సినిమా కావడం తో ఈ సినిమా పై చాలానే అంచనాలు ఉన్నాయి. అయితే.. ఈ సినిమా తరువాత ప్రాజెక్ట్ ను కూడా బాలయ్యబాబు లైన్ లో పెట్టేసుకున్నారని సమాచారం.

Video Advertisement

rakul preeth

ఈ సినిమా కు గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించనున్నారు. వీరిద్దరి కాంబో లో రాబోయే ఈ సినిమా రియల్ స్టోరీ ఆధారం గా రూపొందుతోంది. ఇది ఇలా ఉంటె, ఈ సినిమా కోసం గోపీచంద్ మలినేని పలువురు హీరోయిన్లతో చర్చలు జరిపారట. ఈ సినిమా కోసమే రకుల్ ప్రీత్ ను కూడా గోపీచంద్ సంప్రదించారట. అయితే.. రకుల్ ప్రీత్ మాత్రం అందుకు తిరస్కరించారని వార్తలు వస్తున్నాయి.

akhanda 5

ఇప్పటివరకు యంగ్ హీరోలతో నటించిన రకుల్ ప్రీత్ “మన్మధుడు2” సినిమా లో సీనియర్ హీరో నాగ్ సరసన నటించింది. ఆ సినిమా తో ఘోర పరాభవం ఎదురవ్వడం తో.. రకుల్ సీనియర్ హీరోలతో నటించకూడదని డిసైడ్ అయిందని వార్తల సారాంశం. ఈమె రిజెక్ట్ చేయడం తో ఈ రోల్ కోసం శృతిహాసన్ ను సంప్రదించారట.


End of Article

You may also like