రామ్ చరణ్, ఉపాసన కూతురి జాతకం ఎలా ఉందో తెలుసా..? ఏం చెప్పారంటే..?

రామ్ చరణ్, ఉపాసన కూతురి జాతకం ఎలా ఉందో తెలుసా..? ఏం చెప్పారంటే..?

by Mounika Singaluri

Ads

మెగాస్టార్ చిరంజీవి వారసుడుగా రామ్ చరణ్ సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకుంటూ స్టార్ స్టేటస్ ను సంపాదించారు. రామ్ చరణ్ ఉపాసనని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అపోలో గ్రూప్స్ కుటుంబం నుంచి ఉపాసన కొణిదల కుటుంబ కోడలుగా వచ్చారు. పలు సామాజిక కార్యక్రమాల్లో ఉపాసన చాలా చురుకుగా ఉంటారు.

Video Advertisement

అయితే రామ్ చరణ్ కి ఉపాసనకి పెళ్లి అయిన పది సంవత్సరాల వరకు పిల్లలు లేరు. తాజాగా 2023 జూన్ 20వ తేదీన మంగళవారం తెల్లవారుజామున 1.49 గంటలకు ఉపాసన రాంచరణ్ కుమార్తే క్లింకార జన్మించింది. ఆ పాపకి క్లింకారా అని పేరు కూడా పెట్టారు.

మంగళవారం కావడంతో లక్ష్మీదేవి సాక్షాత్తు తమ ఇంట్లోకి అడుగు పెట్టిందని చిరంజీవి సురేఖ దంపతులు ఉప్పొంగిపోయారు. అయితే వారికి చిన్న లోటు కూడా ఉంది వారు వారసురుడిని కావాలనుకున్నారు. ఎందుకంటే చిరంజీవి కుమార్తెలకు కూడా అందరూ కుమార్తెలే పుట్టారు.

తాజాగా సెలబ్రిటీల జాతకాలు చెబుతూ తాను ఒక సెలబ్రిటీగా మారిన వేణు స్వామి క్లింకారా జాతకాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విడుదల చేశారు. ఆయన చెబుతున్నదాని ప్రకారం పాప మంచి జాతకంలో జన్మించింది. చిరంజీవిని మించిన జాతకురాలు అవుతుంది. ఈ పాప వల్ల చిరంజీవి-సురేఖ రామ్ చరణ్-ఉపాసన దంపతులకు బాగా కలిసి వస్తుంది. ఉపాసన జాతకం అమ్మవారి జాతకం కావడంతో రామ్ చరణ్ రాముల వారి జాతకం. అయితే క్లింకారది అమ్మవారి జాతకం అవుతుందని తెలిపారు.

భవిష్యత్తులో మంచి రంగంలో ఈ పాప సెటిల్ అవుతుందని చిరంజీవి, రామ్ చరణ్, ఉపాసన కంటే మంచి స్థాయికి వెళ్తుందని కుటుంబానికి గౌరవం తెచ్చిపెడుతుందని తెలియజేశారు. అయితే ఈ పాప జాతక ప్రకారం చూస్తే ఆమెకు సోదరి కాని, సోదరుడు కానీ కనిపించడం లేదని వేణు స్వామి తెలిపారు. అంటే రామ్ చరణ్ కు రెండో సంతానం లేదని ఈ అమ్మాయి ఒక్కటే ఏకైక సంతానం అవుతుంది అన్నారు. చిరంజీవి తన కొడుకుతో కలిసి డాన్స్ చేసినప్పుడు పొందిన ఆనందాన్ని రామ్ చరణ్ కూడా పొందాలని, అది నిజం చేయాలంటూ భగవంతుని కోరుకుంటున్నారు.

watch video :

Also Read:“సంపూర్ణేష్ బాబు” హీరోగా నటించిన ఈ సినిమా ఆకట్టుకుందా..? స్టోరీ, రివ్యూ & రేటింగ్.!


End of Article

You may also like