రామ్ చరణ్ – ఉపాసన కుమార్తె క్లీంకార “కేర్ టేకర్‌” ఎవరో తెలుసా..? ఆమెకి ఇచ్చే జీతం ఎంతంటే..?

రామ్ చరణ్ – ఉపాసన కుమార్తె క్లీంకార “కేర్ టేకర్‌” ఎవరో తెలుసా..? ఆమెకి ఇచ్చే జీతం ఎంతంటే..?

by kavitha

Ads

సినీ సెలబ్రెటీల జీవితం ఎంత విలాసవంతంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వారు ఉపయోగించే వస్తువుల నుండి వారింట్లో పెంచుకునే జంతువుల వరకు అన్నీ ఖరిదైనవే ఉంటాయి. వారింట్లో పనిచేసేవారి వేతనాలు కూడా భారీగానే ఉంటాయి.

Video Advertisement

సెలెబ్రెటీల గురించిన పర్సనల్ విషయాలు నెట్టింట్లో క్షణాల్లో వైరల్ గా మారుతూ ఉంటాయి.  తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసనల కుమార్తె కేర్ టేకర్ జీతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆమె ఎవరో? ఆమె జీతం ఎంతో ఇప్పుడు చూద్దాం..
గత ఏడాది రామ్‌ చరణ్‌-ఉపాసన జంటకు క్లీంకార జన్మించిన విషయం తెలిసిందే. మెగా ఫ్యామిలిలోకి వారసురాలు అడుగుపెట్టడంతో మెగా ఫ్యామిలీ అంతా సంతోషంలో మునిగితేలుతుంది. క్లీంకార జన్మించినప్పటి నుండి వారి ఫ్యామిలిలో శుభాలే జరుగుతున్నాయి. గత ఏడాది రామ్ చరణ్‌ నటించిన ఆర్ఆర్ఆర్ మూవీ ఆస్కార్‌ గెలవడం, లావణ్య వరుణ్‌ తేజ్‌ పెళ్లి, తాజాగా చిరంజీవికి  ‘పద్మ విభూషణ్‌’ ప్రకటించడం వరుసగా శుభవార్తలే వినిపిస్తున్నాయి. ఇదంతా తన మనవరాలి రాక వల్లే అని ఆస్కార్ వచ్చిన సమయంలో మెగాస్టార్ స్టేట్‌మెంట్‌ సైతం ఇచ్చారు.
క్లీంకార ఫోటోను ఇప్పటివరకు రివీల్ చేయలేదు. క్లీంకారతో బయటికి వచ్చినా ఆమె ఫేస్ కనిపించకుండా చరణ్, ఉపాసన జాగ్రత్త పడుతున్నారు. మరో వైపు మెగా ఫ్యాన్స్ అంతా ఆమెను చూడాలని ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ఉపాసన క్లీంకార ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసినా ఆమె ముఖం కనిపించకుండా ఎమోజీలతో కవర్ చేస్తోంది. అయినప్పటికి ఆ క్లీంకార ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. తాజాగా క్లీంకారకు సంబంధించిన మరో విషయం వైరల్ గా మారింది. అది ఏమిటంటే, ఆమె కేర్ టేకర్ సావిత్రి శాలరీ.
రామ్ చరణ్ ఉపాసన క్లీంకార కోసం ఒక కేర్ టేకర్ ను పెట్టుకున్నారు. ఆమె సెలెబ్రెటీ సావిత్రి. ఆమె ఇంతకు ముందు పలువురు సినీ సెలబ్రెటీల పిల్లలకు కేర్ టేకర్ గా వ్యవహరించారు. బాలీవుడ్ లో కరీనా కపూర్ కొడుకు తైమూరుకు, షాహిద్ కపూర్ పిల్లలకు సావిత్రి కేర్ టేకర్ గా వ్యవహరించారు. ఒక ఇంటర్వ్యూలో కరీనా సావిత్రి పై ప్రశంసలు కురిపించింది. రీసెంట్ గా రామ్ చరణ్ దంపతులు ముంబై వెళ్లారు. అది సావిత్రిని కలవడానికే అని టాక్. క్లీంకార కేర్ టేకర్ గా పనిచేస్తున్న సావిత్రికి లక్షన్నర జీతం ఇస్తున్నారని సమాచారం. ప్రస్తుతం ఈ విషయం నెట్టింట్లో వైరల్ గా మారింది.

Also Read: 50 కి దగ్గరగా ఉన్నా…పెళ్లి చేసుకోని 10 మంది హీరోయిన్స్.! ఒకొక్కరికి ఒకో కారణం.!


End of Article

You may also like